Tuesday, December 6, 2022

నగరానికి క్షయ ముప్పు…

- Advertisement -

tb-day

జాగ్రత్తలతో తరిమికొట్టవచ్చంటున్న వైద్యులు

మన తెలంగాణ/సిటీబ్యూరో : వేలాది మంది మరణాలకు కారణమయ్యే ప్రధానమైన వ్యాధుల్లో క్షయ ఒకటి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండేవారిలో ఎక్కువగా సోకే ఈ వ్యాధి హెచ్‌ఐవీ బాధితుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మైక్రో బ్యాక్టీరియా ట్యూబర్ క్యూలోసిస్‌గా పిలవబడే బాక్టీరియా వల్ల వచ్చే అంటువ్యాధి క్షయ. గాలి ద్వారా ఊపిరితిత్తులలో ప్రవేశించే ఈ బ్యాక్టీరియా శ్వాసకోశ క్షయవ్యాధికి కారణమవుతుంది. శ్వాసకోశాలకే కాకుండా శరీరంలోని ఇతర భాగాలకు కూడా ఇది వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎముకలు, కీళ్లు, మెదడు పొరలు, మూత్రపిండాలు, గర్భకోశంలో కూడా టిబి సోకవచ్చు. నేడు ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా మనతెలంగాణ ప్రత్యేక కథనం…

world-tb-dayఊపిరితిత్తులపై దాడిచేసే ఈ క్రిములను జర్మనీ దేశ శాస్త్రవేత్త రాబర్ట్‌కాక్ కనుగొన్నారు. ఆయన పరిశోధనల ఫలితంగా క్షయ రావడానికి మైక్రో బాక్టీరియా ట్యూబర్ క్యూలోసిస్ కారణమన్న విషయాన్ని మార్చి 24, 1882న స్పష్టమైంది. ఇందుకు 1905లో ఆయనకు నోబెల్ పురస్కారం కూడా లభించింది. మన దేశంలో 1962లోనే కే ంద్ర ప్రభుత్వం క్షయవ్యాధి నివారణకు ప్రత్యేకమై న చర్యలను తీసుకోవడం ప్రారంభమైంది. ప్రప ంచ ఆరోగ్య సంస్థ 1992లో ప్రత్యేక చికిత్స వి ధానాన్ని డాట్స్ పేరుతో ప్రారంభించింది. వ్యాధి దశను బట్టి ఆరునెలల నుంచి ఏడాదిపాటు మందులను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తుంది.

 నగరంలో ఏడాదికి 15వేల కేసులు….
మనదేశంలో సుమారు 20నుంచి 30శాతం మంది టిబి బారిన పడుతున్నారు. ప్రతిరోజు వందలాది మంది క్షయ వ్యాధితో మరణిస్తున్నారు. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో 1.8 శాతం మందులకు తగ్గని క్షయ కేసులే ఉన్నాయి. ఐదేళ్లలోపు పిల్లల్లో ఏటా 12వేల మంది క్షయ బారిన పడుతున్నారు. భారత్,ఆఫ్రికా, చైనా దేశాల్లో ఎక్కువగా సోకుతున్న వ్యాధిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా గుర్తించింది. హైదరాబాద్ నగరంలో క్షయ ప్రతాపాన్ని చూపుతోంది. అధికారుల గణాంకాల ప్రకారం గ్రేటర్‌లో ఏటా కొత్తగా సుమారు 15వేల క్షయ కేసులు నమోదవుతున్నాయి. అనధికారికంగా ఈ సంఖ్య రెట్టింపు స్థాయిలో ఉన్నటు సమాచారం. ఈ బాధితుల్లో 40ఏళ్ల లోపువారే ఎక్కువగా ఉన్నారు. హైదరాబాద్ జిల్లాలో 40 క్షయ నిర్ధారణ కేంద్రాలు ఉండగా వీటిలో చాలా చోట్ల సేవలు దయనీయంగా ఉన్నాయి.

TB-image

 చెస్ట్ ఆసుపత్రికి తాకిడి….

చెస్ట్ ఆసుపత్రిలో ప్రతి ఏడాది నాలుగు వేల మంది వరకు క్షయ బాధితులు ఇన్ పేషెంట్‌ట్లుగా చేరుతున్నారు. ఇక్కడ ప్రస్తుతం 250 పడకలు ఉన్నాయి. వాటిలో 60శాతానికిపైగా టిబి రోగులె ఉంటున్నారు. ప్రతి ఏడాది 25వేలకు పైగా రోగులు ఓపిలో వైద్య సేవలు పొందుతున్నారు.

lady-image

తీసుకోవాల్సిన జాగ్రత్తలు…

వ్యక్తిగత శుభ్రత పాటించడంతో పాటు నివసించే పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. దగ్గినా, తుమ్మినా చేతిరుమాలు నోటికి అడ్డంగా పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల గాలిలోని సూక్ష్మక్రిములు శరీరంలోకి చేరకుండా చాలా వరకు నివారించవచ్చు. పోషకాహారం తీసుకోవాలి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపైనే ఈ క్రిములు దాడిచేస్తాయి. చిన్నపిల్లలకు బిసిజి టీకాలు ఇప్పించాలి. మూడు వారాలకు మించి దగ్గు, సా య్రంతం వేళ జ్వర ం, ఆకలి లేకపోవడ ం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వై ద్యులను సంప్రదించి పరీక్షలు చేసుకోవాలి. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న డాట్స్ చికిత్సతో,జాగ్రత్తలు పాటిస్తే క్షయ వ్యాధిని తరిమికొట్టవచ్చని వైద్యులు చెబుతున్నారు.

                                            డాక్టర్ రమణ ప్రసాద్ (పల్మనాలజిస్ట్ సినియర్ కన్సల్టెంట్ కిమ్స్ ఆసుపత్రి)

Related Articles

- Advertisement -

Latest Articles