Home ఆఫ్ బీట్ అతి అనర్థమే!

అతి అనర్థమే!

Phone usage

ఎప్పుడెప్పుడు ఫోన్‌ను చెక్ చేసుకోవాలో, ఎప్పుడు
చేయకూడదో ఫోన్ వాడకం గురించి కొన్ని సలహాలు ఇస్తున్నారు నిపుణులు.  

అమెరికన్లు తమ ఫోన్‌ను ప్రతి 12 నిమిషాలకు ఒకసారి చూసుకుంటుంటారు. అంటే రోజుకు సగటున 80 సార్లు అన్నమాట. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఫోన్ చూసుకున్న ప్రతిసారి ఏదో ఒక ఫేక్ న్యూస్ మన సమయాన్ని వృథా చేస్తూనే ఉంటుంది. అయితే ఈ రోజుల్లో హ్యాకింగ్ సమస్యల వల్ల అప్పుడప్పుడు సరిచూసుకోవడం మంచిదే. కానీ పనిలో భాగంగా కీలకమైన సమయాలలో మీరు ఫోన్‌ను చూడకుండా ఉండటమే మంచిదంటున్నారు నిపుణులు.

ఉదయాన్నే నిద్ర లేవగానే ఫోన్ పట్టుకోవాలనే ఆతృత చాలా మందికి బలంగా ఉంటుంది. కానీ ఇలా చేయడం వల్ల మీరు ఆ రోజును వృథా సమయంతో ప్రారంభించినవారవుతారు. ప్రతి రోజు మీ ప్రణాళికను రూపొందించడానికంటే ముందే టెక్నాలజీ వార్తలను, ఇ- మెయిళ్లను, సందేశాలను త్వరగా మన దృష్టికి తీసుకువస్తుంది. అలా అన్నీ చాలా సులభంగా టెక్నాలజీ మేలు చేయడం వల్ల మనం కదలకుండా ఉండిపోతున్నాం. అందువల్ల ఉదయాన్నే పనులన్నీ ఆలస్యమౌతుంటాయి.

పని ప్రణాళిక ముందు..
అల్పాహారం తింటున్నప్పుడు, కారులో వెళ్తున్నప్పుడు, బయటకు వెళ్లడానికి ముందు ఇలా పదేపదే మీ ఫోన్ చూసుకోవడం చెడ్డ అలవాటని నిపుణులు చెప్తున్నారు.

సమావేశ సమయాల్లో…
భోజనం చేస్తున్నపుడు, లేదా వ్యాపార సంబంధిత సమావేశంలో మీకు వచ్చిన మెయిల్స్‌కు స్పందించాలనే ఆతృత ఉంటుంది. అలాంటప్పుడు మీకే ఇబ్బంది కలగకపోవచ్చు కానీ ఇతరులు చాలా ఇబ్బందిగా ఫీలవుతారని అది మంచి ప్రవర్తన కాదు. మీరు పదే పదే ఫోన్ చూడటం వల్ల మీ పక్కనున్న మరొక వ్యక్తిని తక్కువ భావన చేసినట్లుగా అవుతుంది. ఒక వ్యక్తి విధి నిర్వహణలో ఫోన్ చూడటం వల్ల 50 శాతం వరకు ఎక్కువ తప్పులు చేయవచ్చని అధ్యయనకారులు చెబుతున్నారు. సమావేశం కొనసాగుతున్నప్పుడు చేతిలో ఫోన్ ఉంటే పదే పదే చూడాలనిపిస్తుంది. ఆ సమావేశంలో మీరు ఏ పనిని గురించి వివరిస్తున్నారో దాని మీద దృష్టి పెట్టి ఫోన్ దూరం పెట్టడం మంచిది.

బిజినెస్‌లో భాగంగా రోజూ తరచుగా వ్యాపార సంబంధిత కాల్స్, మెయిల్స్, సందేహాల గురించి ఎప్పటి కప్పుడు సమాచారం అవసరం కాబట్టి ఫోన్ చూడాల్సిన అవసరం ఉటుంది. మీరు ముఖ్యమైన వివరాలను ఇతరులకు తెలియజేయాలనుకున్నప్పుడు మీ దగ్గర్లో ఫోన్ ఉండటం వల్ల మీరు పూర్తి నాయకత్వం వహించడానికి అవకాశం ఉండదు. వ్యాపారంలో భాగమైన అన్నింటికి సరైన సమయంలో స్పందించకపోవచ్చు. అయితే ఇతరులు మనతో ఉన్నప్పుడు నిరంతరం ఫోన్‌లో వచ్చే సందేశాల ద్వారా మీరొక్కరే సంతోషపడతారు. కాని ఇతరులు మాత్రం అసౌకర్యానికి గురవుతారు.

మీరు నెట్ వర్క్ పరిధిలో ఉన్నప్పుడు…
వేలాది డాలర్లు చెల్లించి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటుంటాం. అలాంటప్పుడు అక్కడ కూర్చొని శ్రద్ధగా వినకుండా ఫోన్ చేతిలో పట్టుకుని క్యాండ్ క్రష్ గేమ్ ఆడుతుంటారు. కానీ మన తోటి సహచరుడు ఏం చేస్తున్నాడో, అక్కడ చెబుతున్న విలువైన సమాచారాన్ని కోల్పోతాం.

మీరు ఆలోచనల్లో ఉన్నప్పుడు..
సగటున ఒక మనిషి ఆలోచనలను పునః ప్రారంభించడానికి 23 నిమిషాల సమయం పడుతుందని నిపుణులు అంటున్నారు. మీ దృష్టిని అవసరమైన పనికి లేదా ప్రత్యేకంగా కఠినమైన విధిని నిర్వర్తించే టప్పుడు ఫోన్ చూడటం ఒక అనవసరమైన చెత్త పని అని అభిప్రాయం. కాబట్టి ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన పనిలో ఉన్నప్పుడు మీ ఫోన్‌ను సైలెంట్లో పెట్టుకోండి.

పని చివరి సమయాల్లో..
మీరు ఉత్తమంగా పని చేస్తున్నప్పుడు ఆ సమయంలో పరధ్యానాలను ఫోన్ తగ్గించేస్తుంది. కాబట్టి పని సమయాన్ని, మీ సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ పరిసర ప్రాంతాల్లో ఫోన్ లేకుండా జాగ్రత్త పడండి. మధ్యాహ్నం భోజన సమయంలో మీ ఫోనును మీ డ్రాలో ఉంచుకోవాలి. లేకపోతే మీ అత్యంత సమర్థవంతమైన సమయాన్ని అది వృథా చేస్తుంది. రోజులో ఫోన్ చూసుకోవడానికి ఒక ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించుకోవాలి. తద్వారా మీరు మీ ఉత్తమ సమయాన్ని స్నేహితులతో, సన్నిహితులతో సరదాగ గడపవచ్చు. ఈ రోజుల్లో చాలా మంది ఫోన్‌తోనే సమయాన్ని గడిపేస్తున్నారు. ఫోన్‌కు బందీ అవుతున్నారు. ఉద్యోగ రీత్యా కాకుండా రాత్రంతా చాలా పొద్దుపోయే వరకూ ఫోన్‌తోనే గడపడంతో అది అనవసరమైన ఒత్తిడిని సృష్టిస్తుంది.

చదువుతున్నప్పుడు… ‘ఇది ఒక పుస్తకం లేదా ఆన్ లైన్ వ్యాసం ఏకాగ్రతతో చదువుతున్నప్పుడు ఈ ఫోన్ కొన్ని సెకన్ల సమయంలోనే మనల్ని మన ఆలోచనలను పక్కదారి పట్టిస్తుంది. మన మనస్సులో తిరుగుతున్న ఆలోచనలను ఆకస్మికంగా ఆపివేసి దాంట్లో వచ్చే అనవసరమైన మెసేజ్‌లు మనల్ని సాహిత్యం పట్ల ఆసక్తి తగ్గేలా చేస్తాయి.

నిద్రకు ముందు… రాత్రి నిద్రపోయే ముందు తరచుగా ఫోన్ ఉపయోగిస్తే దాన్నుండి వచ్చే నీలి రంగు కాంతి మనల్ని నిద్రపట్టకుండా చేస్తుందని డ్యూక్ యూనివర్సిటీలో పీడియాట్రిక్ న్యూరాలజీ స్లీప్ ఔషధం డైరెక్టర్ ఫర్ మెట్స్ ఫర్మ్ నిద్ర ఆరోగ్య నిపుణుడు సుజయ్ కన్‌సర్గా చెప్పారు .రాత్రి పడుకునే ముందు మనం తరచుగా ఉపయోగించే ఫోన్ స్క్రీన్‌మీద అనేక రకాలైన బ్యాక్టిరీయా ఉంటుంది. అది నిద్రపట్టకుండా చేస్తుంది. అందుకే పడుకునే అరగంట ముందు మీ ఫోన్‌ను దూరంగా ఉంచండని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మధ్య రాత్రిలో… నిద్రపోవటం కష్టం కాదు, కాని నిద్రిస్తున్నప్పుడు మేల్కొనకుండా ఉండటం సవాలుగా ఉంటుంది. సగటున మనుషులు రాత్రి 25 నిమిషాలకొకసారి మేల్కొంటుంటారు. కొందరు మధ్య రాత్రుల్లో ఇంట్లో లైట్‌కు బదులుగా ఫోన్ టార్చ్‌లైట్ వాడుతుంటారు. దాని కోసం ఫోన్ పక్కనే పెట్టుకుని పడుకుంటారు. నిద్ర మత్తులో సమయాన్ని చూడటానికి ఫోన్ కోసం వెతుకుతుంటారు. ఇంది మంచి పద్ధతి కాదని ఫ్లోరిడా విశ్వవిద్యాలయంలో టెలీకమ్యూనికేషన్ విభాగంలో ప్రొఫెసర్ ఆండ్రూ సెలేపాక్ అన్నారు. రాత్రి పూట ఫోన్‌ని తనిఖీ చేయడానికి మించిన చెడు సమయం ఉండదు. అన్నారు. ‘పడుకునే 40 నిమిషాల ముందే మీ ఫోనును వైబ్రేట్లో ఉంచండి, అన్ని నోటిఫికేషన్లను ఆపేయండి. అలారం గడియారాన్ని ఉపయోగించడం ఉత్తమమని నిపుణుల అభిప్రాయం.

Experts Offer Some Advice about Phone usage

Telangana Latest News