Home తాజా వార్తలు ఆర్‌టిసి బస్సుల్లో గుడాంబా అక్రమ రవాణా

ఆర్‌టిసి బస్సుల్లో గుడాంబా అక్రమ రవాణా

06WLJNGp01 06WLJNGp02అనుమానం రాకుండా బియ్యం బస్తాలలో తరలింపు

వరంగల్‌ః జిల్లాలో గుడుంబా నిర్మూలనకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఓ వైపు జిల్లా కలెక్టర్ వాటిక కరుణ పదెపదే చెబుతున్న క్షేత్రస్థాయిలో అమలుకావడంలేదు అనడానికి నిలువెత్తు సాక్షం మద్దూర్ మండలంలోని ధూల్మిట్ట గ్రామ సంఘటన. మండలంలోని ధూల్మిట్ట గ్రామంలో యువకులు గ్రామస్తుల ఆధ్వర్యంలో ఆర్‌టిసి బస్సులో అక్రమంగా గుడాంబాను తరలిసున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు. వారినుండి పెద్ద ఎత్తున గుడాంబాను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు గ్రామస్తులు. గుడాంబాను తరలిసున్న ఇద్దరు వ్యక్తులు చెర్యాల ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు. మద్దూర్ మండలంలోని కొండాపూర్, కూటిగల్ శివారు తాండల నుండి ఈ ధందా సాగుతుందని పలువురు తెలిపారు. ఈ సందర్భంగా వార్డ్ సభ్యులు తాల్లపల్లి కనకయ్య మాట్లాడుతు, ఎక్సైజ్, రెవిన్యూ, పోలీస్ శాఖల సమన్వయ లోపంతో ఇలాంటి పరిణామాలు భహాటంగా జరుగుతున్నాయని, గతంలో పలుమార్లు దాడులు నిర్వహించి గుడాంబాను పట్టుకున్నా అవగహాన సదస్సుల వలన ఎంతోకొంత పరిణితి సాధించిన, క్షేత్రస్థాయిలో అవి అమలుకావడం లేదని అన్నారు. ఇప్పటికైనా గుడుంబా నిర్మూలనకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని, కాసులకు కకృత్తి పడి అమాయకుల కుటుబాలకు నిప్పు పెడుతున్న గుడుంబా మహాంమారిని ప్రొత్సహించొద్దని గ్రామస్తులు కొరుతున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఆటోయూనిమన్ సభ్యులు, పలు స్వచ్చంద సంస్థల ప్రతినిదులు, గ్రామస్తులు పాల్గొన్నారు.