Home జిల్లాలు ఆసరాలో అనర్హులు

ఆసరాలో అనర్హులు

పెద్ద అడిశర్లపల్లి మండలంలో 305 మంది 

నార్కట్‌పల్లి మండలంలో 285 మంది
త్వరలో చౌటుప్పల్, సూర్యాపేట మండలాల్లో తనిఖీలు

సామాజిక తనిఖీల్లో వెలుగు చూస్తున్న వాస్తవాలు

01nlg0106f(-File-photo)నల్లగొండ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలులోకి తెచ్చిన ఆసరా పథకం అనర్హులకు సైతం ఆదాయ వనరుగా మారింది. బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్షంగా అమలవుతున్న ఈ పథకాన్ని అనర్హులు కొందరు నెలనెల పొందుతూ ఎంజాయ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని గత ఏడాది నవంబర్ నుంచి అమలు చేస్తున్న విషయం విధితమే. విశేషమేమిటంటే దారిద్రరేఖకు ఎగువనున్న వారు సైతం జిల్లాలో ఆసరా పథకం కింద పింఛన్లు నిర్భయంగా స్వీకరిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బడుగు బలహీన వర్గాలు, పేదరికంతో ఉన్న వృద్ధులు, వికలాంగులు, వితం తువులు, చేనేత, గీత కార్మికులు ఈ పథకం కింద పింఛన్లు పొందేందుకు అర్హులు. అయా వర్గాల జీవితాలకు భరోసా కల్పించేందుకు అమలులోకి తెచ్చిన ఈ పథకం అనర్హులకు సైతం భరోసా కల్పిస్తుండటం గమనార్హం.

ఈ పథకం కింద అనర్హులు కొందరు లబ్ది పొందుతున్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం వివిధ జిల్లాల్లో సామాజిక తనిఖీలను చేపట్టడంతో అక్రమంగా ఆసరా పింఛన్లను పొందుతున్న వారి గుట్టు రట్టవుతోంది. ఆసరా పథకం కింద నల్లగొండ జిల్లాలో 4.02 లక్షల మంది నెలనెలా పింఛన్ పొందుతున్నారు. ఇందులో పది నుంచి ఇరువై శాతం మంది బోగస్ లబ్దిదారులు ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తునే ఉన్నాయి. ఈ నేపద్యంలో జిల్లాలోని అడిశర్ల పల్లి, నార్కట్‌పల్లి మండలాల్లో ఇటీవల నిర్వహించిన సామాజిక తని ఖీల్లో 590 లబ్దిదారులను అనర్హులుగా అధికారులు తేల్చ డంతో ఆశ్చర్యపోవడం జిల్లా అధికా రుల వంతైంది. పిఎ పల్లి మండల పరిధిలో నిర్వహించిన సామాజిక తనిఖీలో 305 మంది లబ్దిదారులు అనర్హులు గా వెలుగులోకి రాగా నార్కట్‌పల్లి మండలంలో నిర్వహించే సమాజిక తనిఖీల్లో 285 మంది లబ్దిదారులు అనర్హులుగా అధికారులు గుర్తించారు.

అయా రెండు మండలాలలోనే 590 మంది బోగస్ లబ్దిదారులు వేలుగులోకి రావడంతో జిల్లాలోని మిగి లిన అన్ని మండలాల్లో సామాజిక తనిఖీలను నిర్వ హించాలనే నిర్ణయాన్ని జిల్లా ఉన్నతాధికారులు తీసుకు న్నారు. పిఎపల్లి నార్కట్‌పల్లి మండలాల్లో ఆనర్హులుగా గుర్తించిన లబ్దిదారుల్లో మరణించిన లబ్దిదారుల స్థానంలో వారి కుటుంబ సభ్యులు… దారిద్ర రేఖకు ఎగువన ఉన్న కుటుంబాలకు చెందిన కొందరు నెలనెల పింఛన్లు పొందుతున్న విషయం తనిఖీల్లో వెలుగులకి వచ్చినట్లు తెలుస్తోంది. దారిద్ర రేఖకు ఎగువనున్న వారు దారిద్ర రేఖకు దిగువన్నుట్లు దృవీకరణ పత్రాలను సమర్పించి లబ్ది పొందుతున్నారనే విషయాన్ని సామాజిక తనిఖీల్లో అధి కారులు గుర్తించారు. అనర్హులకు పింఛన్లు మంజూరు చేసిన తప్పుడు దృవీకరణ పత్రాలను అందజేసిన అధికారులపైన శాఖ పరమైన చర్యలను తీసు కు నేందుకు అధికారులు అవసరమైన చర్యలను తీసు కోవడంలో నిమగ్నమైనట్లు తెలు స్తోంది. అలాగే పింఛన్ల జారీ ప్రక్రియ నేపద్యంలో విచారణ కొనసాగించిన అధికా రు లపై కూడా శాఖపరమైన చర్యలను ఉన్నతా ధికారులు తీసుకునే అవకాశాలు ఉన్నాయ ంటున్నారు.

సామాజిక తనిఖీల్లో అనర్హులుగా గుర్తించిన లబ్దిదారుల నుంచి ఇప్పటి వరకు వారు ఆసరా పథకం కింద స్వీక రించిన పింఛన్ మొ త్తాన్ని తిరిగి రికవరీ చేయ నున్నామని సంబంధిత శాఖకు చెందిన ఉన్నతాధికారులు ఒకరు ‘మన తెలంగాణ’కు తెలి పారు. జిల్లాలో ఆసరా పథకం కింద పింఛన్లు పొందుతున్న వారిలో ఆనర్హుల గుట్టును రట్టుచే సేందుకు ప్రభుత్వం సామాజిక తనిఖీలను చేపట్టడంతో ఆక్రమంగా ఈ పథకం కింద లబ్దిపొందుతున్న ఆక్ర మార్కు ల గుండెల్లో రైళ్లు పడుగెత్తుతున్నాయి. విశ్వ సనీయంగా తెలిపిన సమాచారం ప్రకారం త్వరలోనే చౌటుప్పల్, సూ ర్యాపేట మండలాల్లో సమాజిక తనిఖీలను అధికారులు నిర్వ హించనున్నట్లు తెలుస్తోంది. ఈ తనిఖీల ప్రక్రియను రాష్ట్ర సమాజిక తనిఖీ అధికారులు కొనసాగిస్తుండటం విశేషం.