Home తాజా వార్తలు ఎంజీఎంను 2 వేల పడకల ఆస్పత్రిగా మారుస్తాం

ఎంజీఎంను 2 వేల పడకల ఆస్పత్రిగా మారుస్తాం

mgm hsptl warngalవరంగల్: ఎంజీఎం ఆస్పత్రిని 2 వేల పడకల స్థాయికి తీర్చి దిద్దుతామని కడియం శ్రీహరి అన్నారు. ఆస్పత్రిలో ఉన్న ఖాళీలను దశలవారీగా భర్తీ చేస్తామని ఆయన అన్నారు. మరో 300 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం కోసం సెంట్రల్ జైల్ సమీపంలో స్థల సేకరణ చేయాలని అధికారులకు ఆదేశం చేశారు. ఆస్పత్రికి ప్రత్యేక పైపులైను ద్వారా మంచినీటిని సరఫరా చేయాలని కడియం శ్రీహరి పేర్కొన్నారు.