Home జిల్లాలు కుల వివక్ష సహించరానిది

కుల వివక్ష సహించరానిది

సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు

పాతపల్లి దళితులకు డబుల్ బెడ్రూం పథకం వర్తింపు
నిందితులపై చర్యలు తప్పవు: కలెక్టర్

మనుషులంతా ఒక్కటే.. ఆత్మగౌరవం, ధైర్యంతో బ్రతికి తమ కుటుంబాల పిల్లలను ఉన్నత చదువులు చదివించాలి. ఆలయ ప్రవేశాలను ఎవరైనా అడ్డుకుంటే చట్టారాత్యా నేరమని, అటువంటి సంఘటనలకు ప్రోత్సహిస్తే వారిపై చట్టం కఠిన చర్యలు తీసుకుంటాం. ఇంతలో శ్మశాన వాటిక గతంలో దళిత నారాయణదని, అయితే అప్పట్లో బోయలకు విక్రయించారని బోయలు చేబుతుండగా, ప్రభుత్వ భూములను కొనుగోలు చేసే అధికారం మీకు ఎవ్వరిచ్చారని కలెక్టర్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

1wnp16పెబ్బేరు: నవ సమాజంలో కుల వివక్ష సహించరానిదని జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి అన్నారు. శనివారం పెబ్బేరు మండల కేం ద్రంలోని పాతపల్లి దళిత న్యాయపోరాట కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షా శిబిరాన్ని జిల్లా ఎస్పీ విశ్వప్రసాద్, జా యింట్ కలెక్టర్ రాంకిషన్,జడ్పీసీఈవో లక్ష్మినారాయణ, భూ సేకరణ స్పెషల్ కలెక్టర్ వనజాదేవి,ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యుటర్ వినోద్‌కుమార్ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం కదిలింది. ద ళితుల సమస్యలపై సుదీర్ఘంగా రెండు గంటలు చర్చించారు.

గత మూడు నెలలుగా పాతపల్లి సంఘటనకు సంబందించి వాస్తవాలను జిల్లా యంత్రాంగం అడిగి తెలుసుకున్నారు.పాతపల్లి దళిత బాధితుడు ఎనమల హుస్సేన్ అధికారులతో జరిగిన వా స్తవాలను సాక్షదారాలతో వివరించారు.గ్రామంలో ఆలయ ప్ర వేశం చేయడం వల్ల దళితులపై బోయలు బౌతికమైన దాడులు చేశారని,తమ ఆత్మగౌరవాన్ని దెబ్బ తీశారని,దళిత మహిళ క లెక్టర్ ఎదుట కన్నీరు మున్నీరుగా విలపించారు. దళితులకు ఇ చ్చిన ప్రభుత్వ భూముల్లో శ్మశాన వాటికను ఏర్పచుకోని ఇదే మిటని ప్రశ్నిస్తే దాడులు చేశారని తెలిపారు.

అనంతరం పాతప ల్లి గ్రామాన్ని సందర్శించి వివాదాస్పద స్థలాలను పరిశీలించా రు.గ్రామంలోని రామాలయంలో దళితులతో పాటు దళిత స ర్పంచ్ సుబద్రమ్మ బోయలతో ఆలయ ప్రవేశం చేసి పూజలు నిర్వహించారు.అనంతరం ఇరువర్గాలతో కలెక్టర్ సహపంకి భో జనాలు చేశారు. అనంతరం విలేఖరులతో కలెక్టర్ మాట్లాడు తూ గ్రామాల్లో అంటరానితనం రూపుమాపాలని,సమరాస్యం ,సఖ్యాతతో మెలగాలని అందుకు గ్రామంలోని అందరు సహక రించాలని కోరారు. మారుతున్న కాలక్రమేణ ఆర్థిక,అసమన తల వల్లే పేద,గోప్ప తేడాలుంటాయని,దీని వల్ల అంటరానిత నం అమానుషంతో దాడులు చేయడం వివక్షకు మారుపేరని ఆమె అన్నారు.ఆలయ ప్రవేశాలను అడ్డుకుంటే చట్టారిత్య నే రమని, అటువంటి సంఘటనలకు ప్రోత్సహిస్తే వారిపై చట్టం కఠిన చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ హెచ్చరించారు.

సర్వే నెంబర్ 4,36లో ప్రభుత్వ స్థలాలను గుర్తించి 45మందికి తె లంగాణ ప్రవేశపెట్టిన డబుల్‌బెడ్రూం పథకం అమలు చేస్తామని ఆమె హామీచ్చారు.శ్మశాన వాటికలో శవలను పెట్టిన స్థలం గ తంలో దళిత నారాయణదని, అయితే అప్పట్లో బోయలకు విక్ర యించారని బోయలు చేబుతుండగా వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వ భూములను కొనుగోలు చేసే అధికారం మీకు ఎవ్వరిచ్చారని ఆమె ప్రశ్నించారు.శ్మశానవాటిక స్థలాన్ని విడిచి సమీపంలో శవాలు ఎందుకు పెట్టారని ఇలాంటి చర్యలకు పా ల్పడటం వల్లే దళితులు అసహనం కొల్పోయరని ఆమె మం డిపడ్డారు.దళితులకు అదే స్థలంలో ఇల్లు నిర్మిస్తామని అయితే పూడ్చిన శవాలను తీయడం హిందూ సంప్రదాయానికి విరుద్ద మని ,ఇంక ముందు రోడ్డు సమీపంలో బోందలు పెట్టరాదని క లెక్టర్ ఆదేశించారు.రోడ్డుకు ఇరువైపుల రోడ్డు మార్గాలను వది లి మిగిలిన ప్రభుత్వ స్థలంలో దళితులకు ఇల్లు కేటాయిస్తు న్నట్లు ప్రకటించడంతో పాతపల్లి దళితులు ఆమెకు ప్రత్యేక అభి నందనలు తెలపారు.
నిందితులపై చట్టపరమైన చర్యలు తప్పవు: జిల్లా ఎస్పి
పాతపల్లి ఘటనలో చట్టాన్ని అతిక్రమించి దాడులకు పాల్పడ్డ నిందితులపై చట్టపరమైన చర్యలు తప్పవని అందుకు వేగవం తం విచారణను చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ విశ్వప్రసాద్ అన్నారు. ఆదివారం ప్రత్యేక అదనపు ఎస్పీని ప్రత్యేక విచారణ అధికారిగా నియమించి జరిగిన దాడుల నేపథ్యాన్ని నేరుగా విచారించి కే సులు నమోదు చేస్తారని ఆయన తెలిపారు. చివరగా కలెక్టర్ మ ళ్ళి దీక్షాశిబిరాన్ని చేరుకోని దీక్షా విరమించాలని కోరగా తమ ఆత్మగౌరవం దెబ్బతిన్నదని అందుకు బాధ్యులైన వారిని కేసుల ను ఎత్తివేయాలని, నిందితులను అరెస్టు చేయాలన్నా డిమాం డ్లను నేరవేర్చాలని అంత వరకు దీక్షాశిబిరాన్ని కొనసాగిస్తామని దళిత న్యాయపోరాట కమిటీ కలెక్టర్‌కు వివరించారు.కలెక్టర్‌తో పాటు స్థానిక ఆర్డీవో రాంచందర్,డిఎస్పీ జోగుల చెన్నయ్య,సీఐ కిషన్,తహశీల్దార్ పాండునాయక్,ఎంపిడిఒ జ్యోతి,జడ్పీటీసీ ప్రకాష్,ఎంపిపి తదితరులు పాల్గొన్నారు.