Home ఆదిలాబాద్ గ్రామ పంచాయతీల వారీగా వివరాల నమోదు

గ్రామ పంచాయతీల వారీగా వివరాల నమోదు

మళ్ళీ తెరపైకి జమా బందీ 

వివాదాల పరిష్కారానికి తోడ్పడనున్న ప్రక్రియ

01adadb11p2ఆదిలాబాద్: భూముల రికార్డులన్నీంటినీ తిరిగి క్రమబద్ధీకరించే ప్రక్రియ జిల్లా వ్యాప్తంగా మొదలుకాబోతుంది. గ్రామాల వారిగా భూముల రికార్డులను క్రోడీకరించి తిరిగి ఆన్‌లైన్‌లో నమోదు చేయ బోతున్నారు. గతంలో నిలిపివేసిన జమాబందీని తిరిగి తెరపైకి తెస్తున్నారు. ఈ జమా బందీ పేరిట గ్రామ పంచాయతీల వారిగా ఈ ప్రక్రియను నిర్వహించనున్నారు. 2005లో చేపట్టిన జమా బందీ ద్వారా పెద్ద ఎత్తున భూముల రికార్డులను సేకరించగలిగారు. ఆ తర్వాత జమా బందీని నిలిపివేయడంతో భూముల లెక్కలు చిక్కుల్లో పడ్డాయి.

రెవెన్యూ శాఖలో చేపట్టబోతున్న ఈ జమా బందీ ప్రక్రియ ఆగస్టు నాటికల్లా పూర్తి చేయాలని అధికారులు భావిస్తు న్నారు. ఈ జమా బందీ ప్రక్రియతో భూ ముల వివరాలన్నీ పకడ్బందీగా ఆన్‌లైన్ కాబోతున్నాయి. ప్రస్తుతం ఈ సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉన్న పహ ణీలపై ఫిర్యాదులు వస్తున్న సంగతి తెలిసిందే. తప్పుడు వివరాలతో వెలువడు తున్న పహాణీలు వివాదాలకు కారణమవు తున్నాయి. తప్పుల కారణంగా గొడవలు, కోర్టు కేసులు, ఫిర్యాదులతో సాధారణ ప్రజానికం సతమతమవుతోంది. ప్రభుత్వ ం ప్రస్తుతం చేపట్టబోతున్న జమా బందీ ప్రక్రియ ద్వారా ఆన్‌లైన్‌లో భూముల రికార్డులన్నీ పకడ్బందీగా నమోదు కాబో తున్నాయి. కాగా ఈ జమా బందీ ప్రక్రి యను ఆన్‌లైన్‌లో సెంటర్‌ఫర్ గుడ్ గవర్నె న్స్ ద్వారా నిర్వహించ తలపెట్టారు.

ముఖ్యంగా మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, ఇచ్చోడ, భైంసా, ఖానాపూర్, కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ తదితర ప్రాంతాల్లో భూముల విలువలు గణనీ యంగా పెరిగాయి. దీంతో సంబంధిత అధికారులు రికార్డులపై దృష్టి కేంద్రీకరి ంచారు. రికార్డులు సక్రమంగా లేకపోవ డంతో ప్రజలు ఏళ్ళ నుండి తీవ్ర ఇబ్బం దులకు గురవుతున్నారు. భూముల రికా ర్డులపై పెద్దఎత్తున వెలువడుతున్న ఫిర్యా దుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ జమా బం దీ కార్యక్రమాన్ని అమలుచేయాలని నిర్ణ యించింది. ప్రభుత్వం చేపట్టబోతున్న ఈ ప్రక్రియ రెవెన్యూశాఖలోని నిర్లక్షాన్ని తొ లగించే అవకాశం ఉంటుం దంటున్నారు.