కొవిడ్ బారి నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : రెండోసారి కరోనా పాజిటివ్ వచ్చిన మెగాస్టార్ చిరంజీవిని సిఎం కెసిఆర్ ఫోన్లో పరామర్శించారు. చిరంజీవికి కరోనా సోకడంతో ఆయన ఆరోగ్య వివరాలను సిఎం కెసిఆర్ అడిగి తెలుసుకున్నారు. చిరంజీవి త్వరగా కోలుకోవాలని గెట్ వెల్ సూన్ అంటూ ఆకాంక్షించారు. కాగా రెండ్రోజుల క్రితం చిరంజీవికి వైరస్ సోకగా.. దీనిపై చిరు అఫీషియల్ ట్వీట్ కూడా చేశారు. వైరస్ బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా సోకింది. మైల్డ్ సింటమ్స్తో బుధవారం కోవిడ్ టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం తాను హోం క్వారంటైన్లో ఉన్నాను. ఇటీవల తనను కలిసిన ప్రతి ఒక్కరు వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నా.. త్వరలో మీ అందరినీ తిరిగి కలుస్తా అని చిరంజీవి ట్వీట్ చేశారు.
CM KCR phone call to megastar chiranjeevi