Home జాతీయ వార్తలు ‘జీ’ సంచలన నిర్ణయం.. పాక్ సీరియల్స్ బ్యాన్

‘జీ’ సంచలన నిర్ణయం.. పాక్ సీరియల్స్ బ్యాన్

Zindagiఢిల్లీ : యురిలో ఉగ్రవాద దాడి ఘటనను ఖండిస్తూ భారత్‌లోని జీ ఎంటర్‌టైన్‌మెంట్ సంచలన నిర్ణయం తీసుకుంది. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు చెందిన జిందగీ ఛానల్‌లో పాకిస్థానీ షోలు నిలిపి వేసే యోచనలో ఉంది. జీ మీడియా ఎస్సెల్ గ్రూప్ ఛైర్మన్ సుభాష్ చంద్ర గోయెల్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఐరాసలో పాక్ వైఖరి దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. జిందగీ ఛానల్‌లో అన్ని పాకిస్థానీ షోలు నిలిపివేసే యోచనలో ఉన్నమని గోయల్ ట్వీట్ చేశారు. అలాగే పాకిస్థాన్ ఆర్టిస్ట్‌లు కూడా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆయన అన్నారు. మహారాష్ట్రలోని నవ నిర్మాణ సేన కూడా ఇప్పటికే పాకిస్థాన్‌కు చెందిన కళాకారులు, నటులు 48 భారత్ విడిచిపెట్టి వెళ్లాలని అల్టిమేటమ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.