Home వరంగల్ దద్దరిల్లిన కలెక్టరేట్లు

దద్దరిల్లిన కలెక్టరేట్లు

mass-plural-castes-image

కదిలిన ‘బిఎల్‌ఎఫ్’ దండు
మా రోజులు రావాలే… ఈ రాష్ట్రాన్నేలాలే…
నినదించిన బహుజన కులాలు
కదిలొచ్చిన వృత్తిదారులు
చేపపిల్లలకు బదులు చెక్కులివ్వాలి..
విలీన గ్రామాలలోని గొర్లకాపరులకు యూనిట్లు కేటాయించాలి
మేము సైతం అంటూ కదిలొచ్చిన రజకులు, ఆరెకటికలు

మన తెలంగాణ/ వరంగల్ అర్బన్ : వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కలెక్టరేట్లు దద్దరిల్లాయి. బహుజన లెప్టు ఫ్రంట్ (బిఎల్‌ఎఫ్) ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన కలెక్టరేట్ల ముట్టడికి బహుజన కులాల దండు కదిలొచ్చింది. వీరికి తోడు నగరంలో సర్వేలు, పర్యటనలలో వెలికిచూసిన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌తో ప్రజలు, కార్మికులు, వివిధ రంగాలలో పని చేస్తున్న వర్కర్లు, వృత్తిదారులు భారీగా తరలొచ్చారు. రంగల్ అర్బన్, వరంగల్ రూరల్ కలెక్టరేట్ల ఎదుట నిర్వహించిన ధర్నాకు ముందుగా బాలసముద్రంలోని ఏకశిలాపార్కులో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా బిఎల్‌ఎఫ్‌లో భాగస్వామ్య సంఘాలైనటువంటి వృత్తి సంఘాల రాష్ట్ర నాయకులు, రాష్ట్ర నేతలు ఉడుత రవీందర్, మొట్టక కుమారస్వామి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా వృత్తిదారులు, బహుజన కులా లు అభివృద్దికి ఆమడ దూరంలోనే ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మాటలతోనే సరిపెడుతుందన్నారు. శాశ్వత ప్రయోజనాలు చేకూరే విధంగా పాలకు లు తమ విధానలను రూపొందించి అమలు చేయాలన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

వృత్తిదారుల అభివృద్దికి చర్యలు చేపట్టాలి: ఉడుత రవీందర్,మొట్టక కుమారస్వామి డిమాండ్
వృత్తుల మీద ఆధారపడి జీవించే వారి అభివృద్దికి తక్షణమే చర్యలు చేపట్టాలని ఉడుత రవీందర్, మొట్టక కుమారస్వామి డిమాండ్ చేశారు. చేపపిల్లలకు బదులు చెక్కులు ఇవ్వాలన్నారు. విలీన గ్రామలలోని గొర్లకాపరులు నిర్లక్షానికి గురవుతున్నారని ఆవేదన చెందిరు. వెంటనే విలీనగ్రామాలలోని గొర్లకాపరులకు రుణాల యూనిట్లు కేటాయించి ఇవ్వాలని కోరారు. గీత వృత్తిని అభివృద్ది చేయాలన్నారు. గీత వృత్తి ఇండ్రస్టీనీ ఏర్పాలు చేసేందుకు ప్రతి జిల్లాలో 10 ఎకరాల భూమిని కేటాయించాల్సిన అవసరముందన్నారు.

నగరంలోని సమస్యలు పరిష్కరించాలి : బిఎల్‌ఎఫ్ రాష్ట్ర నేత జి. నాగయ్య
వరంగల్ నగరంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని బిఎల్‌ఎఫ్ రాష్ట్ర నేత, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు జి. నాగయ్య డిమాండ్ చేశారు. జిఓ 58 ప్రకారం వరంగల్ నగరంలోని గుడిసెవాసులందరికీ వ్యక్తిగత పట్టాలు ఇవ్వాలని, అర్హులైనవారికి డబుల్ బెడ్‌రూలు ఇవ్వాలని కోరారు. దళిత,గిరిజనులందరికీ మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఇవ్వాలన్నారు. అన్ని గ్రామాలలో స్మశాన వాటికలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

నర్సంపేట గ్రీన్ లాండ్స్‌పై విచారణ చేపట్టాలి : యం. చుక్కయ్య
నర్సంపేటలోని గ్రీన్‌ల్యాండ్స్ వ్యవహారం పై తక్షణమే విచారణ చేపట్టాలని బిఎల్‌ఎఫ్ నేత, సిపిఎం వరంగల్ రూరల్ జిల్లా కార్యదర్శి యం. చుక్కయ్య డిమాండ్ చేశారు. గత కొన్ని రోజులుగా నర్సంపేట పట్టణంలో దీక్షలు జరుగుతున్నప్పటికీ అధికారులు స్పంధించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చిత్తశుద్దితో పరిష్కరించాల్సిన అవసరముందన్నారు. ఎంబిసి కులాల అభివృద్ది కోసం కేటాయించిన వెయ్యి కోట్ల రూపాయాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

మేము సైతం అంటూ కదిలొచ్చిన ఆరెకటికలు, రజకులు…
బిఎల్‌ఎఫ్ తలపెట్టిన ఆందోళనలో పాల్గొనెందుకు మేమూ సైతం అంటూ ఆరెకటికలు, రజకులు భారీగా తరలొచ్చారు. మత్సకారులు, గొర్లకాపరులు తదితర వృత్తిదారులు వృత్తుల సూచికలతో ప్రదర్శనలో పాల్గొన్నారు. ఆరెకటికలకు, రజకులకు వ్యక్తిగత రుణాలివ్వాలని నినదించారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు బిఎల్‌ఎఫ్ ఆధ్వర్యంలో జరిగే పోరులో ముందుటామని ఆందోళనలో పాల్గొన్న వృత్తిదారులు, బహుజన కులాలు స్పష్టం చేశాయి.

ఆకట్టుకున్న కళాప్రదర్శనలు
ఆందోళనలో పాల్గొనేందుకు భారీగా జనం తరలిరావడంతో ఉత్సాహా వాతావరణం నెలకొంది. దీంతో కోలాట ఆటలు, కళౠరూపాలను ప్రదర్శించడం, డప్పుల దరువుతో సభా వేదిక మీద కళాకారుల ఆట, పాటలతో ధర్నా వేదికకు నూతనోత్సాహం నిండింది.

ప్రదర్శనలో పొలీసులకు, ఆందోళన కారుల మధ్య సల్ప తోపులాట…
వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాల కలెక్టరేట్ల ఎదుట నిర్వహించ తలపెట్టిన ధర్నాకు ముందుగా బాలసముద్రంలోని ఏకశిలాపార్కులో భారీ సభ నిర్వహించారు. సభలో నేతలు మాట్లాడిన అనంతరం భారీ ప్రదర్శ కలెక్టరేట్లకు తరలింది. దీంతో భారీ జనం కావడంతో పోలీసులు కలెక్టరేట్ల ఆవరణకు వెళ్లేందుకు అనుమతి నిరాకరించారు. పోలీసులు అడ్డుకోవడంతో కాస్త తొపులాట వాతావరణం నెలకొంది. ఈ ఆందోళన కార్యక్రమంలో బిఎల్‌ఎఫ్ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం కన్వీనర్ సాయిని నరేందర్, బిఎల్‌ఎఫ్, సిపిఎం నేతలు, జి. రాములు, సారంపల్లి వాసుదేవరెడ్డి, రత్నమాల, టి.ఉప్పలయ్య, వేల్పుల సారంగపాణి, టి. సాగర్, మంద సంపత్, కాడబోయిన లింగయ్య, ఎంసిపిఐ (యు) నేత మద్దికాయల అశోక్, గాదగోని రవి, టి. రాజేశ్‌కన్నా, రాగుల రమేష్, పెద్దారపు రమేష్ తదితరులతో పాటు బహుజన లెఫ్టు ఫ్రంట్‌లో భాగస్వామ్య సంఘాల నేతలు పాల్గొన్నారు.