Home జనగామ దర్జాగా ఇసుక అక్రమ దందా..

దర్జాగా ఇసుక అక్రమ దందా..

Illegal Transport Sand in Jangoan District

స్థానిక అవసరాల పేరుతో ఇసుక అక్రమ దందా
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న అక్రమార్కులు
నిఘా కొరవడటంతో జోరందుకున్న ఇసుక వ్యాపారం
దేవరుప్పుల: స్థానిక ప్రజలకు తమ అవసరాల నిమిత్తం ఇసుకను వాడుకొవచ్చని సదుద్దెశంతో అధికారులు, ప్రజాప్రతినదులు అనుమతులు ఇవ్వగా ఇదే అదునుగా భావించిన కొందరు ట్రాక్టర్ యజమానులు ఇతర మండలాలకు దర్జాగా ఇసుకను తరలిస్తున్నారు. గత కొంత కాలంగా ప్రభుత్వం అభివృద్ది పనుల పేరుతో దేవరుప్పుల వాగు నుండా ఇసుక రవాణాకు అనుమతులు ఇవ్వడంతో ప్రజలు అగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక తరలింపుతో పరిసర ప్రాంతాలలో భూగర్బ జలాలు అడుగంటిపోయాయి. మరో ప్రక్క రాత్రి వేళల్లో దాదాసాహెబ్ కాలనీ నుండి ఇసుక అక్రమ రావాణా జరుగుతుండగా,ఇటివల మండల వ్యాప్తంగా సైతం ఇసుక వ్యాపారం మూడు పూవ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. దొరికితే దొంగ, దొరకపోతే దిర అన్న చందంగా ఇసుక అక్రమార్కులు దనార్జనే ద్యేయంగా ఇసుకను తరలిస్తున్నారు.
స్థానిక అవసరాల పేరుతో అనుమతులు పొంది ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్‌లను స్థానికులు అడ్డుపడి స్థానిక పోలిసులకు అప్పగించగా కొందరిని స్థానిక తహాశీల్దార్ ఎదుట హజరు పరుస్తున్నట్లు, కొందరిని కొర్టుకు హజరు పరుస్తున్నట్లు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఇసుక అక్రమార్కులకు అరకొర జరిమాలు విదిస్తుండగా వారికి ఏ మాంత్రం బెరుకు లేకుండా పోయిందని కాంగ్రెస్ నాయకలు వాపోయారు. నిఘా కొరవడిందని, మండలంలో ఇసుక అక్రమ వ్యాపారంపై అధికారులు నిఘా పెంచి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు తెలిపారు.
ఇటివల దుర్గమ్మ దేవాలయం నిర్మాణం పనులు జరగుతుండగా దానీ పేరుతో ఇతర ప్రాంతాలకు ఇసుక అక్రమ రవాణా చేపట్టినట్లు గ్రామంలో స్థానికులు వాపోతున్నారు. బుదవారం మండలకేంద్రానికి చెందిన ట్రాక్టర్ యజమానులు వాగులో ఏకంగా ఎక్సవేటర్ పెట్టి ఇసుక తరలింపు చేపట్టగా స్థానికులు అడ్డుకున్నారు. స్థానిక పోలిసులకు సమాచారం ఇచ్చిన సకాలంలో స్పందించలేదని, దీంతో టోల్‌ఫ్రీ నెంబరు 100 పోన్ చేసినట్లు కాంగ్రెస్ నాయకలు తెలిపారు. ట్రాక్టర్ యజమానులను ఇదేమని ప్రశ్నించగా గత రెండు రోజులుగా దుర్గమ్మ దేవాలయం వద్ద మోరం పోశామని అందుకు ఆలయ నిర్వహ కమిటి సభ్యులను డబ్బులు అడిగితే మనిషి రెండు ట్రిప్పులు ఇసుక తరలించుకొండని చెప్పినట్లు స్థానికులు వివరించారు. కాగా ఇప్పటికే స్థానిక ఎమ్మేల్యే బారీ మొత్తంలో నిదులు సమకూర్చినట్లు స్థానిక నాయకులు చెబుతున్నారు. కానీ స్థానిక నాయకులు, ఆలయ నిర్వహకులు స్థానిక ప్రజల నుంచి ప్రతి ఇంటి నుంచి రూ వెయ్యి నుంచి రూ. 2300 వరకు వసులు చేశారు. అంతేకాకుండా స్థానికంగా కాంట్రాక్టు పనులు చేపట్టిన వాళ్ల దగ్గరి నుంచి సైతం బారీ మొత్తంలో వసులు చేసినట్లు వారు తెలిపారు. ఇంత జరగిన ఇసుక అక్రమ రవాణాకు తెరలేపి ఏకంగా వాగులో ఎక్సవేటర్ సాహాయంతో ఇసుకను తరలించంలో మతలాబు ఎంటనీ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిదులు, అధికారులు స్పందించాలని స్థానికులుకోరుతున్నారు.