Home రాష్ట్ర వార్తలు పనే ప్రాతిపదిక

పనే ప్రాతిపదిక

పని భారాన్ని బట్టే పాలనా విభాగాలు 

కొత్త జిల్లాల యంత్రాంగంపై కలెక్టర్లకు సిఎం సూచన, 35 వేలు మించిన జనాభాకు ఒక మండలం,   నోటిఫై చేసినవి 45, మరి 30 కోసం డిమాండ్లు, సాధ్యాసాధ్యాలపై నిర్ణయానికి ఆదేశం 

kcrహైదరాబాద్ : కొత్త జిల్లాల్లో పనిభారాన్ని బట్టి పరిపాలనా విభాగాలు ఉండాలని, దీనికి అనుగుణంగా అధికారుల సర్దుబాటు, కొత్త ఉద్యోగుల నియా మకం జరగాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చెప్పారు. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ నేపథ్యంలో అధికార యంత్రాంగం కూర్పుపై డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసిఆర్ హెచ్‌ఆర్‌డి)లో మంగళవారం సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ దసరా నుంచి కొత్త జిల్లా లతో పాటు కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలు కూడా సమాంతరంగా ప్రారంభం కావాలని కెసిఆర్ తెలిపారు. ముందు గా కొత్త మండలాలను నిర్ధారించాలని, తరువాత రెవెన్యూ డివిజన్ల కూర్పు చేయాలని ఆయన సూచించారు. జిల్లాలు, డివిజన్లు, మండ లాల్లో మొదటి రోజు నుంచే రెవెన్యూ, పోలీసు శాఖల పని ప్రారం భించాలని ఆదేశించారు. మిగతా శాఖల కార్యాలయాలు, అధి కారుల నియామకం కూడా ఆ తరువాత చేపట్టాలని వివరించారు. మూడు అంచెలలో పరిపాలనా విభాగాల ఏర్పాటు, అధికారుల నియామకం తదితర ప్రక్రియలను కలెక్టర్లు పర్యవేక్షించాలని చెప్పారు. మండలాల్లో రెవెన్యూ కార్యాలయాలు, పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటికే విడుదల చేసిన ముసాయిదా నోటిఫికేషన్‌పై ప్రజల నుంచి వచ్చిన స్పందన, అధికారులు చేసిన కసరత్తుల ఆధారంగా అవసరమైన మార్పులు చేసి పునర్ వ్యవ స్థీకరణకు తుదిరూపం ఇవ్వాలని చెప్పారు. ఒక కుటుంబం ఇల్లు మారినప్పుడు ఉండే సమస్యలే, కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా తలెత్తుతాయన్నారు. ప్రారంభ దశలో ఎదు రయ్యే సహజ సమస్యలను గుర్తించి పరిష్కరించాలని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 75 మండలాల కోసం కొత్తగా డిమాండ్లు రాగా, వాటిలో 45 మండలాలను నోటిఫై చేసినట్లు సిఎం చెప్పారు. మరో 30 మండలాల కోసం డిమాండ్లు వచ్చా యని, వాటి సాధ్యాసాధ్యాలపై వెంటనే నిర్ణయం జరగాలని అన్నారు. కొత్తగా ప్రతిపాదించే మండల జనాభా 35 వేలకు పైగా ఉండాలనే నిబంధన పెట్టుకు న్నామన్నారు. అటవీ ప్రాంతాలు, చెంచులు నివసించే ప్రాంతాలకు సంబంధిం చి జనాభా విషయంలో సడలింపు ఇవ్వాలని సూచించారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని కొత్త మంండలాల ఏర్పాటుపై తుది నిర్ణయం తీసు కోవాలని చెప్పారు. విభాగాల ఏర్పాటుకు సంబంధించి సీనియర్ అధికారులు, కలెక్టర్లు, పోలీసు అధికారులు తమ ప్రతిపాదనలను సమా వేశంలో వివరించారు. ఉద్యోగుల పెంపు, తగ్గింపు, సర్దుబాటు, ఆయా శాఖల పనిభారం ఆధారంగా నిర్ణయించాలన్నారు. అధికార యంత్రాంగం సమర్దంగా పనిచేయడం, ప్రజలకు పాలన చేరువ చేయడం, శాంతి భద్రతల పర్యవేక్షణ తదితర విషయాల్లో మరింత బాగా సేవలందించడానికి అనుగుణమైన వాతావ రణం కల్పించాలన్నారు. జిల్లా కలెక్టర్లు ప్రతి కుటుంబంపై అవగాహన కలిగి ఉండడం, పేదలకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం, క్షేత్రస్థాయిలో స్వయంగా పనులు పర్యవేక్షించడం చిన్న పరిపాలనా విభాగాల ఏర్పాటు లక్ష మన్నారు. జిల్లా యూనిట్లు చిన్నగా ఉంటే కార్యక్రమాల పర్యవేక్షణ సులువు అవుతుందన్నారు. ఆయా ప్రాంతాల స్వభావం, సామాజిక పరిస్థితులు, భౌగో ళిక పరిస్థితుల ఆధారంగా ప్రభుత్వ శాఖల విభాగాలను ఏర్పాటు చేయాలని సిఎం సూచించారు. అదిలాబాద్‌లో అంటు వ్యాధులు ఎక్కువ కాబట్టి అక్కడ వైద్య, ఆరోగ్య శాఖను పటిష్టం చేయాలని, ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువ ఉన్న చోట సంక్షేమ అధికారుల సంఖ్య పెంచాలని సిఎం వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయాధికారులు ఎక్కువ అవసరం అని, దీనిని బట్టి ఉద్యో గులను నియమించాని సిఎం ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు జి.జగదీష్ రెడ్డి, పి.మహేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్ శర్మ, డిజిపి అనురాగ్ శర్మ, సీనియర్ ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు, జిల్లాల కలెక్టర్లు, ఎస్‌పిలు పాల్గొన్నారు.