Home తాజా వార్తలు బిల్లులివ్వండి మహాప్రభో…

బిల్లులివ్వండి మహాప్రభో…

rrకొత్తవి లేవు, పాత వాటికి బిల్లులు రావు
కార్యాలయం చుట్టూ
కాళ్లు అరిగేలా ప్రదక్షిణలు
జిల్లా అధికారుల వద్ద
కనీస సమాచారం కరువు
మన తెలంగాణ/రంగారెడ్డి: ప్రభుత్వ పథకాలను, అధికారులను నమ్ముకుని ఉన్న గుడిసెను కూల్చుకుని అప్పులు చేసి రెండు గదుల నిర్మాణం చేసుకున్నాము. నయాపైసా బిల్లు ఇవ్వడం లేదు అప్పులకు వడ్డీలు కట్టలేక అధికారుల చుట్టు తిరగలేక నానా ఇబ్బందులు పడుతున్నామని ఇందిరమ్మ ఇళ్లు కట్టుకున్న అబాగ్యులు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 1,75, 428 ఇళ్లు రిజిస్టర్ కాగా అందులో 1,49,668 ఇళ్లు పూర్తి అయినట్టు రికార్డులు తెలుపుతున్నాయి. ప్రభుత్వం వద్ద రిజిస్టర్ అయిన ఇళ్లు దాదాపు 26 వేల ఇళ్లకు బిల్లులు చెల్లించవలసి ఉంది. కాని జిల్లాలో ఎన్నికల సమయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకపోయినా ఇళ్లు వస్తాయంటు స్దానికంగా అధికారులు, ప్రజా ప్రతినిధులతో పాటు అన్ని పార్టీల రాజకీయ నాయకులు ప్రజలను మభ్యపెట్టి మీరు ఇళ్లు కట్టుకోండి.. మీకు బిల్లులు ఇప్పించేలా మేముచూస్తాం.. అంటూ చెప్పడంతో విచ్చలవిడిగా ఇళ్ల నిర్మాణం చేపట్టారు. జిల్లాలో ప్రభుత్వం వద్ద రిజిస్టర్ అయిన ఇళ్లకు తోడుగా అదనంగా పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలను చేపట్టారు. పరిగి నియోజకవర్గంలో ఇలాంటి ఇళ్లు ప్రతి మండలంలో దాదాపు వెయ్యి వరకు ఉంటాయి. జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో దాదాపు అయిదు వెల వర కు ఇలాంటి ఇళ్లు నిర్మాణాలు చెసుకున్న వారు ఉం డవచ్చు అన్న అంచనాలు వెస్తున్నారు. జిల్లా వ్యాప్తం గా ఎన్ని ఇళ్లకు బిల్లులు చెల్లించాలి ..అసలు ఎంత మంది ఇళ్లు నిర్మించుకున్నారు అన్న విషయంకు సంబందించి జిల్లా అధికారులకు కూడ స్పష్టత లేని పరిస్దీతులు ఉన్నాయి. తాము గ్రామాలకు పోయి వివరాలు సేకరించాలంటే ప్రభుత్వం నుంచి స్పష్టత అవసరం అని ఓ అధికారి అబిప్రాయం వ్యక్తం చెశా రు. తాము గ్రామాలకు పోతే వారికి బిల్లులు ఇవ్వా లి … తాము ప్రస్తుతం ఇచ్చే స్దితిలో లేనప్పుడు ప్రజ ల వద్దకు పోయి తిట్లు తినడం తప్ప ఓరిగేదేమి లేద ని అయన అబిప్రాయం మోహమాటం లేకుండా చెప్పారు. అంటే ప్రభుత్వం నుంచి కావలసిన ఆదేశా ల వచ్చే వరకు తాము ఎమి చెయలేమని అధికారు లు తమ ఆవేదన వ్యక్తం చెస్తున్నారు. ప్రభుత్వం ను నమ్ముకుని లబ్దిదారులు నానా ఇబ్బందులు పడుతు న్నారు. కనిపించిన ప్రతి అధికారికి తమ గోడు చె ప్పుకుంటు ప్రతి సోమవారం నాడు మండల, జిల్లా స్దాయిలో జరుగుతున్న ప్రజాదర్బార్‌లో వినతిపత్రం సమర్పించుకుంటు ముందుకు పోతున్న వారిపై కనికరించే వారు కరువయ్యారు. ఉన్న గుడిసెలో హయిగా ఉన్న తమను తీసుకువచ్చి అప్పుల పాలు చెశారని వారు పడుతున్న అవేదన ఎవరికి పట్టక పోవడంతో వారు కృంగికృశించి పోతున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్‌లు రజిత్‌కుమార్, అమ్రాపాలి సోమవారం నాడు ప్రజావాణిలో ప్రభుత్వం నుంచి అదేశాలు వచ్చాక ఇంటి నిర్మాణాలకు సంబందించి ధరఖాస్తులు చెసుకోవాలని సూచించారు తప్ప గత బిల్లుల గురించి మాత్రం ప్రస్తావించలేదు.
నేడు పోరుబాట..
పేద ప్రజలకు కట్టుకున్న ఇళ్ళకు బిల్లులు ఇవ్వాలని కోరుతు కాంగ్రెస్ పార్టీతో పాటు వామపక్ష సిపిఐ, సిపియం తదితర పార్టీలు పోరుభాటకు సిద్దం అయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా మంగళవారం నాడు నియోజకవర్గ స్దాయిలో దర్నాలు , రాస్తారోకోలు, నిరసన ర్యాలీలు చెయడానికి సిద్దం అవుతున్నాయి. జిల్లాలోని వివిధ పార్టీల నాయకులు ఇందుకు గాను ఇప్పటికే కార్యచరణ సిద్దం చెసుకున్నాయి.
ప్రజల పక్షాన పోరాడుతాం:కార్తిక్ రెడ్డి
అప్పులు చెసి ఇళ్లు కట్టుకున్న వారికి ప్రభుత్వం తక్షణం బిల్లులు చెల్లింపులు చెయాలని చెవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కార్తిక్‌రెడ్డి డిమాండ్ చెశారు. సోమవారం నాడు అయన మాట్లాడుతు పేదలకు ప్రభుత్వం తక్షణం బిల్లులు చెల్లింపులు చెయాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన డబుల్‌బెడ్ రూమ్‌లను కట్టివ్వాలని కోరారు. ప్రజల పక్షాన పోరాటం చెయడానికి తాము ఎల్లపుడు సిద్దంగా ఉన్నామని అయన తెలిపారు. పేదల సంక్షేమం కోసం పనిచెసిన పార్టీ కేవలం కాంగ్రెస్ మాత్రమేనని అయన అన్నారు. జిల్లాలో మంగళవారం నాడు నిర్వహించు దర్నాలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని అయన కోరారు.