Home Default మరోసారి పార్టీ అధ్యక్ష పదవిపై ఆలోచిస్తా: రాహుల్

మరోసారి పార్టీ అధ్యక్ష పదవిపై ఆలోచిస్తా: రాహుల్

Rahul Gandhi

న్యూఢిల్లీ: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సిడబ్లుసి) సమావేశంలో తాను మరోసారి పార్టీ అధ్యక్ష పదవి స్వీకరించడం గురించి ఆలోచిస్తానని రాహుల్ గాంధీ తెలిపారు. సిడబ్లుసి సమావేశంలో అశోక్ గెహ్లాత్ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ పేరును సూచించారు. కాగా మిగతా సభ్యులు సైతం దీనిని ఏకగ్రీవంగా సమర్థించారని సమాచారం.

2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సరైన సత్తాను చాటకపోవడంతో నిస్పృహకు లోనైనా ఆయన పార్టీ అధ్యక్ష పదవిని వదిలేశారు. ఎవరు ఎంత బలవంతపెట్టినా ససేమీరా అన్నారు. ఇప్పుడు పార్టీ శ్రేయస్సు దృష్ట్యా  తిరిగి తన వైఖరి మార్చుకోనున్నారని తెలుస్తోంది.