Home తాజా వార్తలు ముప్పై మూడా? నలభై ఆరా?

ముప్పై మూడా? నలభై ఆరా?

wrl-18స్పష్టతలేని రోడ్డు విస్తరణ పనులు
8అయోమయంలో పట్టణ ప్రజలు
8ప్రజల కోరిక మేరకే రోడ్డు నిర్మిస్తాం
డోర్నకల్: డోర్నకల్ పట్టణంలో గత వా రం రోజులుగా జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. 30,33,40,46,60 అ డుగుల మేరకు రోడ్డు విస్తరణ పనులు జరుగుతాయని పుకార్లు షికార్లు చేయ డంతో ప్రజలు భయాందోళనలకు గురవు తున్నారు. విస్తరణ పనుల్లో ఇటు ఆర్‌అం డ్‌బి అధికారులు 46 అడుగులకు ఒక మారు, 33 అడుగులకు మరోమారు మార్కింగ్ పెట్టి నేటికి తొలగింపు పనులు చేపట్టక పోవడం, గ్రామ ఇఒ జనార్దన్ తన సిబ్బందితో గ్రామంలో 33 అడుగుల మేరకు గృహాలను తొలగించడం స్పష్టత లేని పనులుగా ప్రజలు భావిస్తున్నారు. కొన్ని గృహాలకు 35 నుంచి 40 అడుగుల వరకు గృహాలను తొలగించారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిపి సైడు కాలువల నుంచి 3 అడుగుల మేరకు ఉన్న భూమి జిపి పరిధిలోకి వస్తుందని అత్యుత్సాహంతో గృహాలను తొలగిస్తున్నా రని బాధితులు ఆరోపిస్తున్నారు. కాగా నేటికి ఆర్‌అండ్‌బి శాఖ గృహాలపై స్పష్ట మైన మార్కింగ్ చేయక పోవడం పలు విమర్శలకు తావిస్తుంది. కేవలం 33 అడుగుల మేరకు రోడ్డు విస్తరణ పనులు చేపడతామని ఇందులోనే సైడ్ డ్రైనేజీ కా లువలు సైతం నిర్మించేందుకు అధికారు లతో మాట్లాడి ఖాయం చేయిస్తానని నియోజకవర్గ ఎంఎల్‌ఎ రెడ్యానాయక్ తేల్చిచెప్పడం, 46 అడుగులకు రోడ్డు పనులు జరుగుతాయని అయన వర్గ ప్రజా ప్రతినిధులు చెప్పడం ప్రజలను తీవ్ర అయోమయ పరిస్థితులోకి నెడుతుం ది. ఈ గందరగోల పరిస్థితిపై ఆర్‌అండ్‌బి జిల్లా అధికారి సీనియర్ ఇంజనీర్ మోహన్‌నాయక్‌తో ‘మన తెలంగాణ’ వివరణ కోరగా గతం లో చెప్పిన మాదిరిగానే ఇక్కడి ప్రజల కోరిక మేరకు రోడ్డు నిర్మాన పనులు చేపడతామని చెప్పుకొచ్చారు. గ్రామపం చాయతీ పాలకవర్గం రోడ్డు కోసం భూ మిని చదును చేసి తమకు అప్పగిస్తే వారి కోరిక మేరకే రోడ్డును నిర్మిస్తామని ఇందు లోనే సైడు కాలువలు, విద్యుత్ స్థంబాలు ఏర్పాటుకు సైతం సర్థుబాటు చేస్తామని వివరణ ఇచ్చారు