Home జగిత్యాల రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భక్తులు మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భక్తులు మృతి

Accident

జగిత్యాల:జిల్లాలోని కొడిమ్యాల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. హనుమాన్‌ జయంతి సందర్భంగా కొండగట్టుకు వస్తున్న ఇద్దరు భక్తులను లారీ ఢీకొనడంతో భక్తులు మృతిచెందిన సంఘటన శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చొప్పదండి మండలం భూపాలపట్నం గ్రామానికి చెందిన పున్నం అరుణ్‌(23), పులి రాజేందర్‌(25) హనుమాన్‌ దీక్షాపరులు కొండగట్టుకు పాదయాత్రగా వస్తున్నారు. ఈ క్రమంలో కొడిమ్యాల మండలం దొంగలమర్రి చెక్‌పోస్టు సమీపంలో వారిని లారీ ఢీకొట్టింది.  ఈ ఘటనలో అరుణ్‌ సంఘటన స్థలంలోనే  మృతిచెందాడు. రాజేందర్‌ కు తీవ్రగాయాలు కాగా  ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Two Devotees Dies In Road Accident In jagityal District