Home వనపర్తి విద్యార్థులకు సమయానికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలి

విద్యార్థులకు సమయానికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలి

At midday meal should be arranged for studentsమన తెలంగాణ/వనపర్తి రూరల్ : వనపర్తి మండల పరిధిలోని పెద్దగూడెం గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం గత కొన్ని రోజులుగా సమయానికి అందడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మధ్యాహ్న భోజనం పాఠశాలకు పంపి ణీ చేయడం లేదని విద్యార్థులకు సమయానికి భోజనవసతి కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  విద్యార్థులు వడ్డించిన అన్నం, నీళ్ల చారుతో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది విద్యార్థులు ఇంటి నుండి టిఫిన్ బాక్స్‌లు తీసుకొచ్చి పాఠశాలలో మధ్యాహ్న భోజ నం చేయడం జరుగుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థులకు సమయానికి నాణ్యత గల భోజనం ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు అధికారులను కోరుతున్నారు.