Home తాజా వార్తలు విద్యుత్ సిబ్బందికి 35% పిఆర్ సి

విద్యుత్ సిబ్బందికి 35% పిఆర్ సి

35% pay revision for power utilities employees

విద్యుత్ సిబ్బందికి కెసిఆర్ తీపి కబురు

త్వరలో ఉత్తమమైన హెల్త్‌స్కీం
అంధకారమవుతుందన్న విమర్శలను బద్ధలుకొట్టాం
రాష్ట్ర ప్రగతిరథంలో విద్యుత్‌రంగం పాత్ర కీలకం
ఉద్యోగులతో ముఖ్యమంత్రి కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగులందరికీ సిఎం కెసిఆర్ 35 % పిఆర్‌సి (వేతన సవరణ) ప్రకటించి తీపి కబురు అందించారు. గతేడాది 30% ఇచ్చినందున ఈసారి అంతకంటే కాస్త ఎక్కువగానే వస్తుందని ఉద్యోగులు ఆశించినట్లు జెన్‌కో ప్రభాకర్‌రావు, ఛైర్మన్ ప్రకాశ్‌లు తన దృష్టికి తీసుకొచ్చారని, తాను 27% ఇవ్వాలనుకున్నా చివరకు 35% ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. సిఎం ప్రకటన చేయగానే విద్యుత్ ఉద్యోగు లు హర్షాతిరేకాలు ప్రకటించారు. ‘జై తెలంగాణ’, ‘జై కెసిఆర్’ నినాదాలతో ప్రగతిభవన్ మారుమోగిపోయింది. ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్ విద్యుత్ ఉద్యోగులతో శనివారం సాయంత్రం సమావేశమైన సందర్భంగా వారి సమక్షంలోనే పై ప్రకటన చేశారు. ఈ సందర్భంగా విద్యుత్ ఉద్యోగులను ఉద్దేశించి కెసిఆర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి విజయం విద్యుత్ రంగంలోనేనని అన్నారు. విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఉద్యోగులు ఉత్సాహంగా పనిచేసి మరింత అభివృద్ధి సాధించాలని కోరారు.

ఉత్తమమైన హెల్త్ స్కీమ్
ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా విద్యుత్ ఉద్యోగులకు కూడా ఉత్తమమైన హెల్త్ స్కీంను అమలు చేస్తామని, జెన్‌కో సిఎండి ప్రభాకర్‌రావు వివరాలతో వస్తే దానికి తగినట్లుగానే నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. మిగలిన సం స్థలతో పోలిస్తే విద్యుత్ రంగంలో ఉద్యోగులమీద ఖర్చు కాస్త తక్కువగానే ఉం దని, ఆర్థిక క్రమశిక్షణ మెరుగ్గా ఉందని వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి నిత్య జీవితంలో వృత్తిపరంగా వీరికి రిస్కు కూడా కాస్త ఎక్కువగానే ఉంటోందని, హైడల్ ప్రాజెక్టుల్లో పనిచేసే ఉద్యోగులు రేయింబవళ్ళు అప్రమత్తం గా ఉండి పనిచేయాల్సి వస్తోందని అన్నారు. అత్యవసర సేవల్లోకి వచ్చే విద్యుత్‌రంగం లో ఉద్యోగులు తుపానులు, వడగాలులు లాంటి ప్రకృతి వైపరీత్యాల సమ యంలో కష్టాలకోర్చి కుటుంబాలకు దూరంగా పనిచేస్తూ ఉంటారని, వారి సంక్షేమానికి ప్రభుత్వం తగిన చొరవ తీసుకుంటుందన్నారు. రాష్ట్ర ప్రగతి రథాన్ని ముందుకు తీసుకుపోవడంలో విద్యుత్ ఉద్యోగుల పాత్ర చాలా ముఖ్య మైనదని, పెండింగ్‌లో ఉన్న జిపిఎఫ్, పిపిఎఫ్ సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని సిఎం హామీ ఇచ్చారు. విద్యుత్ సంస్థల్లో పనిచేసే మొత్తం యాభై వేల మంది కార్మికుల్లో ఐదారు వేల మందికి మాత్రమే జిపిఎఫ్, పిపి ఎఫ్ సమస్య ఉందని, గడచిన ఇరవై ఏళ్ళుగా కేంద్ర ప్రభుత్వ పాలసీలో భాగంగా ఇది అమలవుతూ ఉందని సిఎం గుర్తుచేశారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేసి మన రాష్ట్రానికి ఉత్తమంగాఉండే తీరులో ప్రతిపాదనలు చేయాలని సిఎండి ప్రభాకర్‌రావుకు సిఎం సూచించారు. ‘ఉత్సాహంగా పనిచేయండి, రాష్ట్రాన్ని ముందుకు తీసు కెళ్ళండి’ అని పిలుపు ఇచ్చిన ముఖ్యమంత్రి కొత్త సబ్‌స్టేషన్లలో ఇటీవల తగినంతమంది సిబ్బంది లేకపోవడంతో ఓవర్ డ్యూటీ చేయాల్సి వస్తోందని, త్వరలోనే ఈ పోస్టుల్ని భర్తీ చేయాలని సిఎండి ప్రభాకర్‌రావుకు సూచించారు. జూనియర్ లైన్‌మెన్ పోస్టులకు కొన్ని లీగల్ చిక్కులు ఉన్నాయని, అవి త్వరిత గతిన పరిష్కారమయ్యేలా ప్రభాకర్‌రావు చొరవ తీసుకోవాలని సూచించారు.

బాలారిష్టాలను అధిగమించాం : సిఎం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అంధకారం అలముకుంటుందంటూ కొందరు శాపనార్థాలు పెట్టారని, కానీ తెలంగాణ చీకటి అయిపోతదని చెప్పిన వారే చీకట్లో కలిశారని వ్యాఖ్యానించారు. అలాంటి విమర్శలను తప్పని నిరూపిం చడంలో విద్యుత్ ఉద్యోగులు కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలల్లోనే బాలారిష్టాలు అధిగమించామని ఉద్యోగులను ప్రశం సించారు. విద్యుత్ ఉద్యోగుల విషయంలో తన దృష్టికి వచ్చిన సమస్యలన్నిం టినీ ఇప్పటికే పరిష్కరించానని స్పష్టంచేశారు. కోర్టుల్లో ఉన్న కొన్ని కేసులు పరిష్కారం కాగానే మిగతా విద్యుత్ ఉద్యోగులను కూడా క్రమబద్దీకరిస్తామని సిఎం హామీ ఇచ్చారు. విద్యుత్ కార్మికుల కృషితోనే రాష్ట్రం అభివృద్ధిపథంలో పయనిస్తూ ఉన్నదని, ఆరు నెలల వ్యవధిలోనే విద్యుత్ సంక్షోభాన్ని అధిగ మించిన కారణంగా పరిశ్రమలు కూడా రాష్ట్రానికి వచ్చాయని అన్నారు. కరెం టే లేకుంటే మనం కాళ్ళు పట్టుకున్నా కూడా ఏ పరిశ్రమ అధిపతీ మన రాష్ట్రా నికి రారని, జీవితంలో ముఖ్య భాగమైపోయిన విద్యుత్ సామాన్య ప్రజానీకా నికి కూడా నిత్యావసరమైపోయిందన్నారు. రాష్ట్రం ఏర్పడేనా టికి ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోవడం, వ్యవసాయ పంపుసెట్లు కాలిపోవడం లాంటి అనేక సమస్యలున్నాయని,ఎన్నో బాధలు పడి పరిస్థితిని గాడిలో పెట్టామని అన్నారు.