టాలీవుడ్ సూపర్ స్టార్, ప్రిన్స్ మహేష్ బాబు, వంశీ పైడిపల్లి కాంబోలో వస్తున్న ‘మహర్షి’ మూవీ రేపు (గురువారం) వరల్డ్ వైడ్ గా విడుదలకు సిద్ధమైంది. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా అభిమానులను ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి. ఇప్పటికే ‘మహర్షి’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యు/ఏ సర్టిఫికేట్ పొందింది. ఇక దుబాయ్ లో కూడా విడుదలవుతోన్న ఈ చిత్రం అక్కడ కూడా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. అక్కడి సెన్సార్ బోర్డ్ సభ్యుడు, సినీ క్రిటిక్ ఉమైర్ సంధు తెలుగు సినిమాలకు ఫస్ట్ రివ్యూలు ఇస్తోన్న సంగతి తెలిసిందే. ‘మహర్షి’ సినిమాకు కూడా ఆయన రివ్యూ ఇచ్చారు. విడుదలకు ముందే సోషల్ మీడియా ద్వారా సినిమాలకు ఫస్ట్ రివ్యూ ఇచ్చే ఉమైర్ ‘మహర్షి’ రివ్యూ ఇచ్చేశారు.
ఆయన ఈ చిత్రానికి నాలుగు స్టార్లు వేయడం విశేషం. ఈ సందర్భంగా ఉమైర్ సంధు ట్వీట్ చేశారు. ‘మహర్షి’ సినిమాను అత్యా ద్భుతంగా తెరకెక్కించారని చెప్పిన ఆయన అన్ని విభాగాల్లో మూవీ సాలిడ్ గా ఉందన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకలు చిత్రం ఆకట్టుకోవడం ఖాయమని స్పష్టం చేశారు. మూవీలో మహేష్ నటన ఆల్టిమేట్ అని కితాబిచ్చారు. ప్రిన్స్ తన నటనతో అబ్బురపరిచారని కొనియాడారు. మంచి సామాజిక సందేశంతో పాటు కమర్షియల్ మూవీగా వంశీ పైడిపల్లి తెరకెక్కించిన విధానం ఆకట్టుకుందని తెలియజేశారు. మహేష్ తో పోటిపడి మరీ పూజా హెగ్డే తన నటన, అందంతో మైమరిపించిందని చెప్పారు. పక్కా పైసా వసూల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఉమైర్ రివ్యూ మహేష్ ఫ్యాన్స్ ను ఖుషి చేసేదే అయినా ఒకింత కలవరపాటుకు గురిచేస్తోంది. దీనికి కారణం ఆయన ఇంతకుముందు మహేష్ నటించిన ‘స్పైడర్’ చిత్రానికి కూడా నాలుగు స్టార్ల రేటింగ్ ఇచ్చారు. కానీ ఆ మూవీ అట్టర్ ప్లాప్ గా మిగిలింది. దీంతో ఉమైర్ సంధు రివ్యూపై సినీ విశ్లేషకులతో పాటు ప్రిన్స్ అభిమానులు కూడా నమ్మకంగా లేరనేది కాదనలేని వాస్తవం.
First Review of Maharshi from Umair Sandhu
First Review #Maharshi from UAE Censor Board ! A Well Made Film in all aspects. #MaheshBabu Stole the Show all the way. Full on engaging Social Thriller. @hegdepooja looking Stunning in the film. Paisa Vasool Family Entertainer ⭐⭐⭐⭐ pic.twitter.com/edEXaXR67b
— Umair Sandhu (@UmairFilms) May 7, 2019
Saw #Maharshi at Censor Board !! Just MINDBLOWING ! In #Maharshi , #Superstar @urstrulyMahesh Stole the Show in 3 Getups ! A Student.. A CEO in NYC and a Farmer. He is One Man Show. ⭐⭐⭐⭐ pic.twitter.com/GgR6U31XzJ
— Umair Sandhu (@UmairFilms) May 7, 2019