Friday, March 29, 2024

ఉల్కపై రాళ్లను సేకరించిన స్పేస్‌క్రాఫ్ట్..

- Advertisement -
- Advertisement -

NASA Spacecraft collect rock samples on Asteroid Bennu

వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా)కు చెందిన ఒసిరిస్ రెక్స్ స్పేస్‌క్రాఫ్ట్ విజయవంతంగా బెన్నూ ఉల్కపై వాలింది. అక్కడ ఉపరితలం నుంచి రాళ్ల నమూనాలను సేకరించింది. ఈ రాళ్లకు చాలా పురాతన చరిత్ర ఉంది. మన సౌరవ్యవస్థ పుట్టుక దశ నాటి రాళ్లను తీసుకుని ఈ అంతరిక్ష నౌక తిరిగి రానుందని నాసా తెలిపింది. సౌర వ్యవస్థ పుట్టుపూర్వోత్తరాలు, భౌగోళిక పరిణామాల అన్వేషణకు నాసా ఈ వ్యోమనౌకను కక్షలోకి పంపించింది. భూమికి 321 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న అస్థరాయిడ్ బెన్నూ ఖగోళ స్వరూపాన్ని తెలిపే అత్యంత కీలకమైన ఉల్కగా శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు.

దీనిలోని పరిణామాలు విశ్వసృష్టి క్రమాన్ని తెలియచేస్తాయని పరిశోధకులు పేర్కొంటున్నారు. సౌర వ్యవస్థ ఆద్యంతాలకు ఈ శకలం ఆద్యంతం గవాక్షంగా నిలుస్తుంది. భూమిపైకి జీవన పరిణామం తలెత్తడానికి ఈ ఉల్క ప్రధాన కారకంగా మారి ఉంటుందని విశ్లేషిస్తున్నారు. దీనితో అక్కడి రాయి రప్పలకు కూడా శాస్త్రీయంగా విలువ ఉంది. దీనిని పరిగణనలోకి తీసుకుని కోటానుకోట్ల సంవత్సరాలకు ముందు తలెత్తిన పరిణామాల విశ్లేషణకు వీటిని ప్రాతిపదికగా చేసుకుంటారని శాస్త్రజ్ఞులు తెలిపారు. స్పేస్‌క్రాఫ్ట్ సేకరించిన ఈ నమూనా ప్రక్రియను టచ్ అండ్ గో(టాగ్)గా వ్యవహరిస్తున్నారు. అయితే ఉల్క రాళ్లు రప్పలను తీసుకుని ఈ స్పేస్‌క్రాఫ్ట్ నేలపైకి 2021 మార్చిలో దిగుతుంది.

NASA Spacecraft collect rock samples on Asteroid Bennu

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News