Tuesday, April 23, 2024

చంద్రుడిపై 4జి నెట్‌వర్క్

- Advertisement -
- Advertisement -

Nokia 4G network on moon

వాషింగ్టన్ : చంద్రుడిపై సెల్ నెట్‌వర్క్‌కు రంగం సిద్ధం అయింది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా చంద్రుడిపై 4 జి సెల్యూలర్ నెట్‌వర్క్ ఏర్పాటుకు కాంట్రాక్టు దక్కించుకుంది. 14.1 మిలియన్‌డాలర్ల ఈ కీలక కాంట్రాక్టును నాసా నోకియాకు అప్పగించింది. నోకియా 4జి/ఎల్‌టిఇ నెట్‌వర్క్‌ను అంతరిక్షంలో ఏర్పాటు చేయాలని సంకల్పించిందని, ఇది చివరికి 5 జి స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తుందని నాసా ఓ ప్రకటనలో తెలిపింది. చంద్రుడిపై పరిశోధనలు , అంతరిక్ష అన్వేషణలకు సంబంధించి ముందుకు వచ్చే వివిధ కంపెనీలకు కాంట్రాక్టులు అప్పగించేందుకు నాసా అత్యంత ప్రతిష్టాత్మకంగా 370 మిలియన్ డాలర్ల విలువైన కాంట్రాక్టులను తలపెట్టింది. ఇందులో భాగంగా చంద్రుడిపై నెట్‌వర్క్ దిశలో నోకియా కీలక బాధ్యతలను చేపట్టనుంది.

Nokia 4G network on moon

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News