హైదరాబాద్: మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక, జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించబోతోంది. ఈ నెల 9వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ లో వీరి పెళ్లి జరగనుంది. దీంతో కొణిదెల కుటుంబంలో పెళ్లి హంగామా మొదలైంది. నిహారిక ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కు సంబంధించి పలు ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.దీంతోపాటు మెగాస్టార్ చిరంజీవి కుమార్తెలు సుస్మిత, శ్రీజ దంపతులు చైతన్యను తమ కుటుంబంలోకి ఆహ్వానిస్తూ బుధవారం రాత్రి ఓ ప్రత్యేక పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో వరుణ్ తేజ్, సాయితేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు అర్జున్ భార్య స్నేహ తదితరులు సందడి చేశారు. తాజాగా నిహారికని పెళ్లి కూతురు చేసే కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. వీటిని చూసిన నెటిజన్లు నిహారికకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Niharika Konidela pre wedding photos viral