Friday, April 19, 2024

పిఎం డిగ్రీ సర్టిఫికేట్‌ను సమర్పించాల్సిన అవసరం లేదు: గుజరాత్ హైకోర్టు

- Advertisement -
- Advertisement -
అడిగినందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నుంచి రూ. 25,000 వసూలు!

అహ్మదాబాద్: ప్రధాని కార్యాలయం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ డిగ్రీ, పిజి సర్టిఫికేట్లను సమర్పించాల్సిన అవసరంలేదని గుజరాత్ హైకోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. మోడీ డిగ్రీ, పిజి డిగ్రీలకు సంబంధించిన సమాచారాన్ని అందించాలని ప్రధాన సమాచార కమిషన్(సిఐసి) ప్రధాని కార్యాలయం, గుజరాత్ విశ్వవిద్యాలయం, ఢిల్లీ విశ్వవిద్యాలయం పివోలకు ఇచ్చిన ఆదేశాలను న్యాయమూర్తి బీరేన్ వైష్ణవ్‌తో కూడిన వన్‌జడ్జీ ప్యానెల్(సంఘం) తోసిపుచ్చింది.

ప్రధాని డిగ్రీ సర్టిఫికేట్ల గురించి అడిగినందుకు కోర్టు ఖర్చుల కింద రూ. 25,000 ఛార్జీని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు విధించింది. చీఫ్ ఇన్‌ఫార్మేషన్ కమిషన్ నిర్ణయంపై గుజరాత్ యూనివర్శిటీ అప్పీల్ చేసింది. దానిని హైకోర్టు విచారణ చేస్తోంది. ‘ప్రజాస్వామ్యంలో పదవి నిర్వహిస్తున్న వారు చదువుకున్న వారా, నిరక్షరాస్యుడా అన్న భేదం ఉండదు. ఇందులో ప్రజా ప్రయోజనం ఏమి ఇమిడిలేదు. వ్యక్తిగత విషయం కూడా ప్రభావితం కాదు’ అని లీగల్ వెబ్‌సైట్ బార్ అండ్ బెంచ్ పేర్కొందని యూనివర్శిటీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ యూనివర్శిటీ నుంచి 1978లో డిగ్రీ చేశానని, ఢిల్లీ యూనివర్శిటీ నుంచి 1983లో పిజి చేశానని ఇదివరలో ప్రకటించారు.

కేజ్రీవాల్ తరఫు న్యాయవాది పెర్సీ కవీనా ‘ఒకవేళ మీరు నామినేషన్ ఫారమ్ (ఎన్నికలప్పుడు నింపింది) చూస్తే దాంట్లో విద్యార్హతలు కనపడాలి. అందుకనే మేము ఆయన డిగ్రీ సర్టిఫికేట్ గురించి అడుగుతున్నాము. ఆయన మార్కుషీట్ గురించి అడుగుతున్నాము’ అని వాదించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News