Friday, April 26, 2024

మరోసారి మంచి మనస్సును చాటుకున్న కెటిఆర్..

- Advertisement -
- Advertisement -

మరోసారి తన మంచి మనస్సును చాటుకున్న కెటిఆర్
కందికొండ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా
ఆర్ధికంగా చితికిపోయిన కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ మరోసారి తన మంచి మనస్సును చాటుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టు మిట్టాడుతున్న ప్రముఖ సినీ గేయ రచయిత కందికొండ యాదగిరి కుటుబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం తన ట్విట్టర్ వేదిక ద్వారా ఆయన వెల్లడించారు.
కెటిఆర్ కేవలం ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లోనే కాదు.. సామాజిక అంశాల పట్ల అంకితభావంతో ఉంటారన్న సంగతి అందరికి తెలిసిందే. జనం కష్టాలు సోషల్ మీడియా ద్వారా తన దృష్టికి వచ్చినా వెంటనే అగమేఘాలపై స్పందిస్తుంటారు. చాలా మందికి తాను ఉన్నానంటూ అండగా నిలుస్తున్నారు. తన మంచి మనసును చాటుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కందికొండ కుటుంబ పరిస్థితి విషయమై ఆయన కుమార్తె మాతృక రాసిన లేఖపై కెటిఆర్ స్పందించారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామన్నారు. ఆ కుటుంబానికి గతంలో కూడా అండగా ఉన్నామని, ఇప్పుడు కూడా ఆదుకుంటామని కెటిఆర్ హామీ ఇచ్చారు.

ఆరు నెలల క్రితం కందికొండ ఆరోగ్యం విషమించడంతో కిమ్స్‌లో ఆయనకు ప్రభుత్వం తరఫున చికిత్స అందించారు. తన తండ్రి చికిత్సకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అండగా నిలిచిందని కందికొండ యాదగిరి కూతురు మాతృక పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం తమ కుటుంబం ఆర్థికంగా చితికిపోయిందని, ఇంటి అద్దె కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నామంటూ మాతృక ఇటీవల మంత్రి కెటిఆర్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. చిత్రపురి కాలనీలో ఇంటి కోసం గతంలో తన తండ్రి రూ.4 లక్షలు కట్టారని, ఇప్పటికీ ఇల్లు మంజూరు కాలేదని పేర్కొన్నరు. ఈ నేపథ్యంలో చిత్రపురి కాలనీ లేదా వేరేచోట ప్రభుత్వం ఇల్లు ఇచ్చి ఆదుకోవాలని ఆ లేఖలో ఆమె కోరారు. ఇంటి విషయంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో పాటు తన కార్యాలయ సిబ్బంది సమన్వయం చేసి సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరించేలా చూస్తామని హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News