Friday, March 29, 2024

సింగరేణి నిర్లక్ష్యంతోనే యువ కార్మికుడు మృతి

- Advertisement -
- Advertisement -

గోదావరిఖని: సింగరేణి ఆర్జీ 3 పరిధిలోని ఓసిపి 1 సిహెచ్‌పిలో సర్ఫేస్ ఫీడర్ వెల్డర్ ట్రైనీ బట్టి బైనాథ్ కుమార్ ఫైర్ ఫీడర్ బ్రేకర్ పనులు నిర్వహించుకొని వెళ్తున్న క్రమంలో ఎక్స్‌నెంబర్ బ్లాస్ట్ అయి మృతి చెందాడని, ఇది పూర్తిగా సింగరేణి నిర్లక్షంతోనే జరిగిందని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి అన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బైనాథ్ కుమార్‌కు తీవ్ర గాయాలు కాగా, అతన్ని సింగరేణి ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారని చెప్పారు. ఈ మేరకు శనివారం సింగరేణి ఆసుపత్రి వద్ద ఆయన బైనాథ్ కుమార్ మృతదేహాన్ని పరిశీలించారు.

ఈ ప్రమాదం పూర్తిగా సేఫ్టీ నిర్లక్షంతో జరిగిందని ఆరోపించారు. మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. యాజమాన్యం వెంటనే కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, మృతుని భార్యకు ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట నాయకులు వి.విజయకుమార్ రెడ్డి, గుత్తికొండ గోపాల్, మేదరి సారయ్య, మెండే శ్రీనివాస్ తదితరులున్నారు. అదేవిధంగా ఈ సంఘటన యాజమాన్యం నిర్లక్షం వల్లనే జరిగిందని, మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు తోకల రమేష్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News