Friday, April 19, 2024

హైదరాబాద్‌కు చావోరేవో

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌కు చావోరేవో.. నేడు రాజస్థాన్‌తో కీలక పోరు

IPL 2020:SRH vs RR Match 2020 Tomorrow

దుబాయి: వరుస ఓటములతో సతమతమవుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గురువారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్ చావోరేవోగా తయారైంది. ఇపట్పికే 9 మ్యాచుల్లో ఆరింటిలో ఓడిన హైదరాబాద్ ప్లేఆఫ్ అవకాశాలను క్లిష్టంగా మార్చుకుంది. ఒకవేళ నాకౌట్ రేసులో నిలువాలంటే రాజస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో గెలవడం తప్ప సన్‌రైజర్స్‌కు మరో మార్గం కనిపించడం లేదు. బౌలర్లు బాగానే రాణిస్తున్నా బ్యాటింగ్ వైఫల్యం జట్టుకు సమస్యగా తయారైంది. మనీష్ పాండేకు వరుస అవకాశాలు కల్పిస్తున్నా అతను మాత్రం దాన్ని సద్వినియోగం చేసుకోలేక పోతున్నాడు. జానీ బైర్‌స్టోలో కూడా నిలకడ లోపించింది. ఒక మ్యాచ్‌లో రాణిస్తే మరో మ్యాచ్‌లో విఫలమవుతున్నాడు. డేవిడ్ వార్నర్, విలియమ్సన్‌లలో మునుపటి దూకుడు కనిపించడం లేదు. ఒకప్పుడూ విధ్వంసక బ్యాటింగ్‌కు మరో పేరుగా ఉన్న వార్నర్ ఈ సీజన్‌లో తన స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచడంలో విఫలమవుతున్నాడు. అతని వైఫల్యం జట్టుకు సమస్యగా తయారైంది. విలియమ్సన్ ఒక్కడే నిలకడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. అయితే కిందటి మ్యాచ్‌లో కేన్ గాయం బారిన పడ్డాడు.

IPL 2020: RR vs KKR Match Tomorrow

దీంతో ఈ మ్యాచ్‌లో అతను ఆడుతాడా లేదా అనేది సందేహంగా తయారైంది. ప్రియమ్ గార్గ్, విజయశంకర్ తదితరులు పెద్దగా ప్రభావం చూపలేక పోతున్నారు. కనీసం ఈ మ్యాచ్‌లోనైన వీరు తమ బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం ఉంది. కాగా, హైదరాబాద్ బౌలింగ్ మాత్రం చాలా బలంగా మారింది. సందీప్ శర్మ, విజయ్ శంకర్, నటరాజన్, రషీద్ ఖాన్ తదితరులు పొదుపుగా బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థి జట్లను తక్కువ స్కోరుకే పరిమితం చేస్తున్నారు. ఈసారి కూడా జట్టు బౌలర్లపై భారీ ఆశలు పెట్టుకుంది. మరోవైపు రాజస్థాన్‌కు కూడా ఈ మ్యాచ్ కీలకంగా తయారైంది. కిందటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించిన రాజస్థాన్ ఈ పోరుకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. అయితే సంజు శాంసన్, బెన్ స్టోక్స్ తదితరులు ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్నారు. శాంసన్, ఉతప్ప, స్టోక్స్‌లు ఈ మ్యాచ్‌లోనైన బ్యాటింగ్‌ను మెరుగు పరుచుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే జట్టుకు సమస్యల తప్పక పోవచ్చు. ఇక కిందటి మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన జోస్ బట్లర్‌పై జట్టు ఈసారి కూడా భారీ ఆశలు పెట్టుకుంది. స్టీవ్ స్మిత్ కూడా ఫామ్‌లో ఉండడం రాజస్థాన్‌కు కలిసి వచ్చే అంశం. ఇదిలావుండగా రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉండడంతో మ్యాచ్ నువ్వానేనా అన్నట్టు సాగడం ఖాయం.

IPL 2020:SRH vs RR Match 2020 Tomorrow

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News