Home జాతీయ వార్తలు ట్రక్కుకు రూ.1,41,700 జరిమానా

ట్రక్కుకు రూ.1,41,700 జరిమానా

Truck

 

జైపూర్: ఢిల్లీలో రాజస్థాన్‌ కు చెందిన ట్రక్కు కు ట్రాఫిక్ అధికారులు భారీగా జరిమానా విధించారు. ఆ ట్రక్కు ఓవర్ లోడ్‌తో వెళ్తుండడంతో రూ.1,41,700 రవాణా అధికారులు జరిమానా విధించారు. ఆ ట్రక్కుకు సంబంధించిన పత్రాలు లేకపోవడంతో పాటు రోడ్డు ట్యాక్స్ కూడా చెల్లించకపోవడంతో భారీ జరిమానా విధించినట్టు సమాచారం. ఈ ట్రక్కు భగవన్ రామ్ దిగా గుర్తించారు. ఢిల్లీలోని రోహిణిలో కోర్టులో ట్రక్కు రూ.1.41 లక్షలు చెల్లించాడు.  జరిమానాపై నెటిజన్లు పలు రకాలు కామెంట్లు చేస్తున్నారు. ప్రభుత్వాలు భారీగా ఫైన్లు వేయడం కాదు రోడ్లు పరిస్థితి బాగు చేయాలని సూచిస్తున్నారు. రోడ్లు గుంతల మయంగా ఉండడంతోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. గతంలో ఒడిశాకు చెందిన ట్రక్కుకు రూ. 86,500 ఛలాన్ విధించినట్టుగా ఉంది. 

 

1.41 lakh challan to Rajasthan truck Over Loading