Friday, April 19, 2024

కడుపులో దాచిన కొకైన్ విలువ కోట్లలోనే

- Advertisement -
- Advertisement -
1 kg of cocaine seized in Delhi airport
రూ.845 కోట్ల విలువైన డ్రగ్స్ మింగిన మహిళ
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పట్టివేత

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ లోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం మరోసారి పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఉగాండాకు చెందిన ఓ మహిళ 992 గ్రాముల కొకైన్‌ను 91 క్యాప్సూల్స్‌లో నింపి మింగేసింది. వాటిని మనదేశంలో స్మగ్లింగ్ చేసేందుకు యత్నించింది. ఢిల్లీ విమానాశ్రయం లోని కస్టమ్స్ అధికారులు ఆ మహిళను తనిఖీ చేసి మొత్తం 91 కాప్సూల్స్‌ను బయటకు తీయించారు. ఈ డ్రగ్స్ విలువ దాదాపు రూ. 845 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఆమెను అరెస్టు చేశారు. ఎన్‌డిపిఎస్ చట్టం లోని సెక్షన్ 43 ( బి) jకింద ఆమెపై కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News