Friday, April 26, 2024

హరీష్ హత్య కేసులో నిందితుల అరెస్ట్.. బామర్దే ప్రధాన నిందితుడు

- Advertisement -
- Advertisement -

బామర్దే ప్రధాన నిందితుడు
తన చెల్లిని ప్రేమ వివాహం చేసుకున్నాడని కోపం పెంచుకున్న బామర్ది
పదిమందిని అరెస్టు చేసిన పేట్‌బషీరాబాద్ పోలీసులు

హైదరాబాద్: ఈనెల 1వ తేదీన హత్యకు గురైన హరీష్ కేసులో నిందితులను పేట్‌బషీరాబాద్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. పదిమందిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు, మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసుల కథనం ప్రకారం…జియాగూడకు చెందిన దీన్‌దయాల్ జిహెచ్‌ఎంసిలో కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తున్నాడు. త్రిముఖే నరేష్, పోట్లచెరువు వెంకటేష్ గౌడ్, కాళీభవానివాలా రోహిత్ సింగ్, బ్యాండ్ వెంకట్, పరివారి అనికేత్, కోయలకర్ మనీష్, బురే సాయినాథ్, మాతంగి రాజేంద్రకుమార్, గౌటి నవనీత కలిసి హత్య చేశారు. హరీష్, దీన్‌దయాల్ సోదరి ఐదు నెలల నుంచి ప్రేమించుకున్నారు. ఈ క్రమంలోనే హరీష్‌తో యువతి ఛాటింగ్ చేస్తుండగా దీన్‌దయాల్ చూశాడు.

వెంటనే హరీష్‌కు వార్నింగ్ ఇచ్చాడు తన చెల్లితో స్నేహం చేయవద్దని చెప్పాడు. దీనిని ఇద్దరు పెడచెవిన పెట్టారు, ఎప్పటి మాదిరిగానే ఇన్‌స్టాలో ఛాటింగ్ చేసుకునేవారు, ఫోన్‌లో మాట్లాడుకునేవారు. ఈ క్రమంలోనే యువతి గత నెల 22వ తేదీన కాలేజీకి వెళ్లింది. అక్కడే హరీష్‌ను కలిసింది, తమ ప్రేమను ఇంట్లో వారు అంగీకరించరని పారిపోయి వివాహం చేసుకుందామని యువతి హరీష్‌కు చెప్పింది. ఈ విషయం హరీష్ తన ప్రాణస్నేహితుడు రాజేంద్రకుమార్‌కు చెప్పాడు, తనకు వెంటనే ఉద్యోగం చూపించాలని కోరాడు. తర్వాత యువతిని తీసుకుని పోయి హరీష్ వివాహం చేసుకున్నాడు.

తర్వాత రాజేంద్రకుమార్ చూపించిన వెంచర్‌లో గార్డుగా ఉద్యోగంలో చేరాడు హరీష్. తన చెల్లిని ప్రేమ వివాహం చేసుకున్నాడనే కోపంతో హరిష్‌ను హత్య చేయాలని దీన్‌దయాల్ ప్లాన్ వేస్తున్నాడు,. దానికి అనుగుణంగా కత్తులు కొనిపెట్టుకున్నాడు. తర్వాత హరీష్ ఎక్కడ ఉంటున్నాడో తెలుసుకుని స్నేహితుల సాయంతో అక్కడికి వెళ్లి కత్తులతో పోడిచి చంపివేశాడు. హరీష్‌ను హత్య చేసిన తర్వాత నిందితుడు తన చెల్లిని తీసుకుని వెళ్లాడు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News