Wednesday, November 30, 2022

గురుకులంలో పుడ్ పాయిజన్.. వంద మంది బాలికలు అస్వస్థతకు గురి

- Advertisement -

10 Gurukul students take ill due to food poisoning

 

కరీంనగర్ : జిల్లాలోని చొప్పదండిలోని సోషల్ వెల్పేర్ బాలికల గురుకులలో శుక్రవారం పుడ్ పాయిజన్ కావడంతో దాదాపు వంద మంది బాలికలు అస్వస్థతకు గురి కాగా 35 మంది విద్యార్థులను మెరుగైన వైద్యం అందించేందుకు హుటాహుటిన కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. మిగత వారికి స్థానికంగానే వైద్యం అందిస్తున్నారు. విద్యార్థులు మధ్యాహ్నం బోజనంలో క్యాబేజీ కూర వల్ల పుడ్ పాయిజన్ జరినట్లు తెలుస్తుంది. జరిగిన ఘటనపై సమాచారం తెలుసుకున్న రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెంటనే స్పందించి విద్యార్థులకు ఏలాంటి ఇబ్బందులకు గురి కాకుండా మెరుగైన వైద్యం అందించాలని ఫోన్ ద్వారా కలెక్టర్‌ను, వైద్యాధికారులను ఆదేశించారు. ఎవరికి ఏలాంటి ఇబ్బంది లేదని అందరు త్వరగా కోలుకుంటారని , విద్యార్థుల తల్లి దండ్రులు అందోళన చెందవద్దని మంత్రి తెలిపారు. ఈ విషం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తక్షణమే స్పందించిన జిల్లా వైధ్యాధికారిని: చొప్పదండిలోని సోషల్ వెల్పేర్ బాలికల గురుకులలో దాదాపు వంద బాలికలు కలుషితం ఆహారం తినడం వలన అస్వస్థతకు గురి అయ్యారు. దీంతో వేంటనే విషయం తెలుసుకున్న జిల్లా వైద్యాధికారిని జూవేరియా తక్షణమే వసతి గృహానికి చేరుకుని విద్యార్థులకు ఏలాంటి హాని జరుగకుండ అక్కడే ఉండి వైద్య సహాయం అందించారు. తీవ్ర అస్వస్థతకు గురి అయిన విద్యార్థులను కరీంనగర్ జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తు న్నారు. అంతే కాకుండా ఘటన జరిగిన వసతి గృహాంనకు ఉమ్మడి జిల్లా గురుకుల ఆర్‌సివో అలివేలు, చొప్పదండి తహాశీల్దార్ రజిత కూడ అక్కడి పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్బంగా జిల్లా వైద్యాధికారిని జూవేరియా మాట్లాడుతూ విద్యార్థులు అందరు క్షమంగా ఉన్నారని, ఎవరికి ఎలాంటి ఆపాయం లేదని తెలిపారు.

నిర్లక్ష్యం వలనే సంఘటన : విద్యార్థుల తల్లిదుండ్రులు
సోషల్ వెల్పేర్ బాలికల గురుకులలో జరిగిన సంఘటన చాల బాధకరమని అన్నారు. సిబ్బంది నిర్లక్షం వలనే ఘటన జరిగిందని అవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పురావృతం కాకుండా చూడాలని వేడుకున్నారు. నాణ్యమైన ఆహారం అందంచకపోవడంతో పుడ్ పాయిజన్ జరిగిందని తెలిపారు. దీని కారణమైన బాధ్యులపై కఠిన చర్యతీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.

తల్లి దండ్రులు ఆందోళన వద్దు : మంత్రి గంగుల
జరిగిన ఘటనపై సమాచారం తెలుసుకున్న రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెంటనే స్పందించి విద్యార్థులకు ఏలాంటి ఇబ్బందులకు గురి కాకుండా మెరుగైన వైద్యం అందించాలని ఫోన్ ద్వారా కలెక్టర్‌ను, వైద్యాధికారులను ఆదేశించారు. ఎవరికి ఏలాంటి ఇబ్బంది లేదని అందరు త్వరగా కోలుకుంటారని , విద్యార్థుల తల్లి దండ్రులు అందోళన చెందవద్దని మంత్రి తెలిపారు.

అస్వస్థతకు గుడ్డు, క్యాబేజీ కర్రి కారణం : బాలికల గురుకులలో దాదాపు వంద బాలికలు కలుషితం ఆహారం తినడం వలన అస్వస్థతకు గురి ఆయ్యారు. విద్యార్థులను అడుగగా క్యాజేజీ కర్రీ, గుడ్డు సరిగ్గా హుడుకక పోవడమే కారణం అని తెలిపారు. వాటిని తినడం వలన పుడ్ పాజయిన్ అయ్యిందని తెలిపారు.

10 Gurukul students take ill due to food poisoning

Related Articles

- Advertisement -

Latest Articles