Wednesday, April 24, 2024

భద్రాచలంలో గంజాయి పట్టివేత

- Advertisement -
- Advertisement -

10 kgs cannabis seized in Bhadrachalam

భద్రాచలం: భద్రాచలం బస్టాండ్ లో మంగళవారం 10 కేజీల గంజాయిని సీజ్ చేశారు. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సింకు బేరాను అదుపులోకి తీసుకున్నట్లు భద్రాచలం ఎఎస్‌పి వినీత్ తెలిపారు. మంగళవారం ఉదయం 8 గంటలకు పట్టణ సిఐ స్వామి ఆధ్వర్యంలో ప్రొబిషనరీ ఎస్‌ఐ నాగేశ్వరరావు సిబ్బందితో కలిసి స్థానిక బస్టాండులో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఒక వ్యక్తి బ్యాగ్‌తో అనుమానంగా కనిపించాడు. అతడిని సోదా చేయగా బ్యాగులో లక్ష 50 వేలు విలువ చేసే 10 కేజీల గంజాయి దొరికినట్లు ఎఎస్‌పి వెల్లడించారు. ఈ గంజాయిని సీలేరు నుంచి ఒంగోలుకు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. భద్రాచలం పట్టణ సరిహద్దుల్లో నిరంతరం పోలీసుల తనిఖీలు ఉంటాయని, నిషేధిత వస్తువులు, గంజాయి వంటి మాదకద్రవ్యాలను తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

10 kgs cannabis seized in Bhadrachalam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News