Friday, January 27, 2023

పంజాబ్ అసెంబ్లీ సమీపంలో పేలుడు!

- Advertisement -

Suicide-Attack-Punjab-Lahor

లాహోర్ : పాకిస్థాన్‌లో పంజాబ్ రాష్ట్రంలో ఆత్మహుతి దాడి జరిగింది. పంజాబ్ అసెంబ్లీ సమీపంలో జరిగిన ఈ ఆత్మహుతి దాడిలో దాదాపు 10 మంది మృతి చెందగా, 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులే లక్షంగా చేసిన ఈ దాడిలో లాహోర్ ట్రాఫిక్ పోలీస్ చీఫ్ మొబీన్ అహ్మద్, లాహోర్ సీనియర్ ఎస్‌పి జాహిద్ గొండాల్ మరణించారు. స్థానిక మందుల షాపుల యజమానులు తాజాగా ప్రభుత్వం జారీ చేసిన ఔషధ ఒప్పందాలకు నిరసనగా చేపట్టిన ర్యాలీలో ఈ పేలుడు సంభవించినట్లు లాహోర్ పోలీస్ చీఫ్ అమిన్ వైన్స్ పేర్కొన్నారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసు అధికారులు, మరో ఎనిమిది మంది మృతి చెందినట్లు ఆయన తెలిపారు. ఈ దాడిలో గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ దాడికి పాల్పడింది ఎవరు అనే విషయంపై ఇంకా ఎటువంటి సమాచారం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles