Home తాజా వార్తలు వికారాబాద్ అడవుల్లో మళ్లీ వేటగాళ్ల ముఠా హల్ చల్..

వికారాబాద్ అడవుల్లో మళ్లీ వేటగాళ్ల ముఠా హల్ చల్..

హైదరాబాద్: వికారాబాద్ అడవుల్లో మళ్లీ వేటగాళ్లు హల్ చల్ చేస్తున్నారు. అనంతగిరి, బషీరాబాద్ అడవుల్లో వేటగాళ్ల ముఠా రాత్రి సమయాల్లో అడవి జంతువులను వేటాడుతున్నారు. అడవుల్లోకి బైకులపై వెళ్లి జంతువులను వేటాడుతున్నట్లు తెలుసుకుని రంగంలోకి దిగిన బషీరాబాద్ పోలీసులు పది మంది వేటగాళ్ళను అరెస్టు చేశారు. వేటగాళ్ల నుంచి నాలుగు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. కర్నాటక, హైదరాబాద్ కు చెందిన వేటగాళ్లుగా పోలీసులు గుర్తించారు. అదుపులోకి తీసుకున్న వేటగాళ్లను పోలీసులు రిమాండ్ కు తరలించారు.

10 members of Hunting gang arrested in Vikarabad