Home Default తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

Road Accidentచెన్నయ్ : తమిళనాడులో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది ఘటనాస్థలిలోనే చనిపోయారు. ప్రయాణికులతో వెళుతున్న ఓ ప్రైవేటు బస్సును విల్లుపురం జిల్లా కల్లాకుర్చి వద్ద వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొంది. ఈ ఘటనతో కల్లకుర్చి -సేలం నేషనల్ హైపై మూడు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది. ప్రమాదం జరిగిన సమయంలో ట్రక్కులో 14 మంది కార్మికులు ఉన్నారు. వీరిలో 11 మంది జార్ఖండ్ ప్రాంతానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. వీరు కాంచీపురం జిల్లా నుంచి తిరుపూర్ జిల్లాలో విద్యుత్ పంపిణీ లైన్లు ఏర్పాటు చేసేందుకు వెళుతున్నారు.  మృతి చెందిన వారిలో మదురైకి చెందిన ట్రక్కు డ్రైవర్‌ ఎం.మణికండన్‌, తిరునైవేలికి చెందిన బస్సు డ్రైవర్‌ ఎ. రాజేంద్రన్‌ కూడా ఉన్నారు. మిగిలిన మృతుల వివరాలు తెలియరాలేదు. చెన్నై నుంచి కోయంబత్తూరు వెళ్తున్న ప్రైవేటు బస్సులో 26 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదం అన్నా నగర్‌ ఫ్లైఓవర్‌ వద్ద జరిగింది. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

10 People Dead In Road Accident At Tamil Nadu