Thursday, April 25, 2024

భారీగా పెట్రో వడ్డన

- Advertisement -
- Advertisement -

Petrol, diesel prices

పెట్రోల్‌పై లీటరుకు రూ.10, డీజిల్‌పై రూ.13 పెంపు
అదనపు సుంకాల పేరుతో భారం మోపిన కేంద్రం

న్యూఢిల్లీ: కేంద్రం పెట్రోలు, డీజిల్ రేట్లను భారీగా పెంచేసింది. పెట్రోల్, డీజిల్‌పై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని, రోడ్డు, మౌలిక సదుపాయాల సెస్‌ను పెంచుతూ మంగళవారం రాత్రి పొద్దుపోయాక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సుంకాల పెంపుతో పెట్రోల్ ధర లీటరుకు రూ.10, డీజిల్ లీటరుకు రూ.13 మేర పెరగనుంది. పెంచిన కొత్త రేట్లు బుధవారం ఉదయం 6 గంటలనుంచి అమలులోకి వస్తాయి. గత మార్చి 21న దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రారంభమైనప్పటినుంచి పెట్రోల్ ధర లీటరుకు రూ.69.59గా కొనసాగుతుండగా, డీజిల్ ధరకూడా రూ.62.29గానే ఉంది.

కరోనా అనంతరం దేశ ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణం కోసం అవసరమైన నిధుల సమీకరణకు ప్రభుత్వం మార్గాలను అన్వేషించే క్రమంలో ఈ చర్య తీసుకొంది. పెట్రోల్‌పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.2, డీజిల్‌పై రూ.5 పెరిగింది. కాగా ఈరెండు ఇంధనాలపైన, రోడ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెస్‌ను రూ.8 చొప్పున పెంచినట్లు మంగళవారం పొద్దుపోయాక విడుదల చేసిన ఉత్తర్వులో ప్రభుత్వం తెలిపిం ది. పెట్రోల్, డీజిల్‌పై ప్రభుత్వం ప్రత్యేక ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.18, రూ.12 మేర పెంచడానికి వీలు కల్పిస్తూ 2020 ఆర్థిక బిల్లులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సవరణలు తీసుకు వచ్చిన రెండు నెలల తర్వాత ప్రభుత్వం ఈ సుంకాలను పెంచడం గమనార్హం.

వ్యాట్ పెంపుతో ఢిల్లీలో పెరిగిన పెట్రో ధరలు

ఢిల్లీలో పెట్రో ధరలు పెరిగాయి. దీనికి కార ణం ఢిల్లీ ప్రభుత్వం వాల్యూ యాడెడ్ టాక్స్(వ్యాట్)ను పెంచింది. దీని వల్ల లీటరు పెట్రోలుపై ధర రూ.1.67, డీజిల్‌పై రూ.7.10 పెరిగింది. దీంతో ఇక్కడ లీటరు పెట్రోలు ధర రూ.71.26కు చేరగా, ఇంతకుముందు ఈ ధర రూ.69.59గా ఉంది. డీజిల్ ధర లీటరు రూ.69.39కి పెరగనుంది. ఈ డీజిల్ ధర ఇంతకుముందు రూ.62.29 మాత్రమే. ఢిల్లీ ప్రభుత్వం వ్యాట్ ను పెంచడం వల్ల వార్షికంగా రూ.900 కోట్ల మేరకు ఆదాయం రానుంది.

10 per liter on petrol and Rs 13 per liter on diesel

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News