Home అంతర్జాతీయ వార్తలు బంగారు గని కూలి 10 మంది మృతి

బంగారు గని కూలి 10 మంది మృతి

Gold Mine Collapseగనియా దేశంలో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది బంగారు గని కూలి 10 మంది చనిపోయారు. గనియా ఈశాన్య ప్రాంతంలోని కోనార్కీ సమీపంలో ఉన్న బంగారు గని ప్రమాదవశాత్తూ కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో గనిలో ఉన్న 10 మంది సజీవ సమాధి అయ్యారని రెడ్ క్రాస్ ప్రతినిధులు తెలిపారు. అయితే గనిలో 10 మంది కంటే ఎక్కువగానే కార్మికులు ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. గనిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

10 Workers Died In Gold Mine Collapse At Guinea