Tuesday, April 23, 2024

కరోనా వల్ల 100 కోట్లు దాటనున్న ప్రపంచ పేదరికం

- Advertisement -
- Advertisement -

100 crore world poverty due to Coronavirus

న్యూయార్క్ : కరోనా వైరస్ వల్ల ప్రపంచంలోని పేదల సంఖ్య 100 కోట్లకుపైగా చేరనున్నట్టు ఓ అంతర్జాతీయ నివేదిక వెల్లడించింది. అదనంగా పేదల జాబితాలోకి చేరేవారు 39కోట్ల 50 లక్షలు కాగా, ఇందులో సగానికిపైగా దక్షిణాసియా దేశాల్లోనేనని నివేదిక పేర్కొన్నది. కింగ్స్ కాలేజ్ లండన్, ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ లండన్, యునైటెడ్ నేషన్స్ యూనివర్పిటీ ఇనిస్టిట్యూట్ ఫర్ డెవలప్‌మెంట్ ఎకనామిక్స్ రీసెర్చ్ సంస్థలు ఈ పరిశోధన నిర్వహించాయి. ప్రపంచంలోని పేదవాళ్లు గతంతో పోలిస్తే రోజుకు 50 కోట్ల డాలర్ల ఆదాయం కోల్పోతున్నట్టు నివేదిక తెలిపింది.

రోజుకు 1.9౦ డాలర్లకన్నా తక్కువ ఆదాయం ఉన్నవారిని పేదవారిగా పరిగణిస్తారు. కొత్తగా పేదవాళ్ల జాబితాలో చేరేది 39 కోట్ల 50 లక్షలమంది కాగా, ఇందులో సగానికిపైగా దక్షిణాసియాలోనే. వీరిలో అధిక భాగం అధిక జనాభా ఉన్న భారత్‌లోనే అని నివేదిక పేర్కొన్నది. ఆఫ్రికన్ దేశాల్లో 30 శాతం లేదా 11కోట్ల 90 లక్షలమంది అదనంగా పేదవాళ్లుగా మారనున్నారు. నైజీరియా, ఇథియోపియా, బంగ్లాదేశ్, ఇండోనేషియాల్లో అదనంగా చేరే పేదవాళ్లు 1819 శాతం కాగా, డిఆర్‌సి(కాంగో), టాంజానియా, పాకిస్థాన్, కెనా ఉగాండా, ఫిలిప్పైన్స్‌లో 1112 శాతంమేర ఉంటారని నివేదిక తెలిపింది. నాలుగింట మూడొంతుల పేదరికం జనాభా అధికంగా ఉన్న పది దేశాల్లోనని నివేదిక తెలిపింది.

100 crore world poverty due to Coronavirus

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News