Monday, November 4, 2024

తీవ్రవాదుల దాడుల్లో వంద మంది మృతి

- Advertisement -
- Advertisement -

100 Dead In Attacks On Two Western Niger Villages

నైజర్: తీవ్రవాదుల దాడుల్లో వంద మంది మృతి చెందిన సంఘటన పడమర నైజర్ ప్రాంతంలో జరిగింది. నైజర్ సరిహద్దులో ఉన్న చోమా బంగౌ, జరౌమదరయే గ్రామాలపై తీవ్రవాదుల విచక్షణరహితంగ కాల్పులు జరపడంతో చోమా బంగౌలో 70 మంది, జరౌమదరయే గ్రామంలో 30 మంది చనిపోయినట్టు అధికారులు వెల్లడించారు. నైజర్ రాజధాని నైమాయ్ ప్రాంతానికి ఆ గ్రామాలు 120 కిలో మీటర్ల దూరంలో ఉన్నాయి. తీవ్రవాదుల కాల్పుల్లో మరో 75 మంది గాయపడినట్టు మేయర్ హస్సాన్ తెలిపాడు. ఈ ప్రాంతం మాలీ, బుర్కైనా, నైజర్ సరిహద్దుల్లో ఉంటుందన్నారు. శనివారం తమపై ఆదిపత్యం వహిస్తున్న బోకోహారమ్‌కు చెందిన ఇద్దరు తీవ్రవాదులను గ్రామస్థులు కొట్టి చంపారు. రెచ్చిపోయిన ఉగ్రవాదులు ఆ గ్రామాలపై కాల్పులు జరిపినట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News