Thursday, April 25, 2024

బీరూట్ పేలుళ్లలో 100 మంది మృతి

- Advertisement -
- Advertisement -

 4 వేల మందికి పైగా క్షతగాత్రులు

 మృతుల కోసం కొనసాగుతున్న గాలింపు
 లెబనాన్‌కు ప్రపంచ దేశాల సాయం

బీరుట్: లెబనాన్ రాజధాని బీరుట్ నగరాన్ని ధ్వంసం చేసిన అత్యంత శక్తివంతమైన పేలుళ్లలో దాదాపు 100 మంది మరణించగా సుమారు 4,000 మందికి పైగా గాయపడ్డారు. పోర్టులోని గిడ్డంగులలో నిల్వ చేసిన ఎరువులు, బాంబులలో ఉపయోగించే అమ్మోనియం నైట్రేట్ వల్ల పెద్ద ఎత్తున పేలుళ్లు సంభవించి నగరంలోని అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద మరి కొన్ని శవాలు ఉండవచ్చన్న అనుమానంతో సహాయక సిబ్బంది బుధవారం కూడా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. మూడేళ్ల అంతర్యుద్ధంతో ఆర్థికంగా పతనమైన లెబనాన్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న దశలో కరోనా మహమ్మారి రూపంలో మరో పెను సవాలును ఎదుర్కొంటోంది. ఈ దశలో బీరుట్‌లో జరిగిన ఈ పేలుళ్లు ప్రజలను మరింత భయాందోళనలకు గురిచేస్తున్నాయి. పేలుళ్ల తీవ్రతకు బీరుట్‌కు దాదాపు 160 కిలోమీటర్ల దూరంలోని సైప్రస్ దీవిలో ఇళ్లు కూడా కంపించిపోయాయి.

ఎటువంటి భద్రత చర్యలు చేపట్టకుండా 2,750 టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ను గత ఆరేళ్లుగా పోర్టులోని గిడ్డంగులలో నిల్వ చేశారని లెబనాన్ అధ్యక్షుడు మిషెల్ ఔన్ తెలిపారు. ఈ చర్యను ఆయన ఖండించారు. నిర్లక్షం కారణంగానే ఈ పేలుళ్లు సంభవించాయని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ అవినీతి, దుష్పరిపాలన వల్లే దేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందని, ప్రస్తుత పరిస్థితికి ప్రభుత్వమే కారణమని లెబనాన్ ప్రజలు ఆరోపిస్తున్నారు. కాగా, బీరుట్‌లో పరిస్థితి యుద్ధ రంగాన్ని తలపిస్తోందని, పరిస్థితిని చూస్తుంటే తనకు మాటలు కూడా రావడం లేదని బీరుట్ మేయర్ జమాల్ ఇటానీ బుధవారం నగరంలో పర్యటిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన నష్టం వేల కోట్ల డాలర్లలో ఉంటుందని, ఇది బీరుట్‌కు, లెబనాన్‌కు పెను సంక్షోభమని ఆయన వ్యాఖ్యానించారు.ఇదిలా ఉండగా లెబనాన్‌కు సహాయం అందచేసేందుకు గల్ఫ్ అరబ్ దేశాలు ముందుకు వచ్చాయి. ఇరాన్ జోక్యం కారణంగా గతంలో సహాయం నిలిపివేసిన గల్ప్ దేశాలు వైద్య పరికరాలు, ఆహార సరఫరాలను లెబనాన్‌కు విమానాల ద్వారా పంపించాయి. అలాగే ఇరాన్ కూడా ఆహార పదార్థాలు, వైద్య సిబ్బందిని పంపడానికి సంసిద్ధతను తెలియచేసింది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇతర పశ్చిమ దేశాలు కూడా సహాయం అందచేయడానికి ముందుకు వచ్చాయి. లెబనాన్‌కు వైద్యులు, నర్సులు, నిష్ణాతులైన గాలింపు, సహాయక బృందాలను పంపుతున్నట్లు నెదర్లాండ్స్ తెలిపింది.

100 people died after explosion in beirut

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News