Home కరీంనగర్ వినాయక నిమజ్జనంలో విషాదం..

వినాయక నిమజ్జనంలో విషాదం..

Pulihora

 

కరీంనగర్: వినాయక నిమజ్జనంలో విషాదం చోటు చేసుకున్న ఘటన జిల్లాలోని గంగాధర మండలంలో జరిగింది. వివరాల్లోకి వెళ్లితే… మండలంలోని లింగంపల్లిలో గణేష్ నిమజ్జనం సందర్భంగా వినాయకుడి వద్ద ప్రసాదంగా పంచిన పులిహోరా తిని 100 మంది అస్వస్థతకు లోనయ్యారు. తక్షణమే స్థానికులు వారిని కరీంనగర్ సర్కార్ దవాఖానాకు తరలించారు. బాధితుల్లో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. స్థానికుల సమాచారంతో దవాఖానాకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. పులిహోరాలో ఏమైన విష ప్రయోగం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

100 people sick food poison in ganesh immersion