Thursday, April 25, 2024

ఆర్‌టిసిలో నో కరోనా

- Advertisement -
- Advertisement -

100 percent of TSRTC Staff now vaccinated

హైదరాబాద్: ఆర్‌టిసిలో ప్రయాణించే వారు ఇక నుంచి కరోనా వైరస్ పట్ల భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తమ సంస్థలో 100 శాతం సిబ్బంది కరోనా వాక్యిన్ వేయించుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్‌టిసిలో పని చేస్తున్న 48,214 సిబ్బంది వ్యాక్సిన్‌కు సంబంధించిన రెండు డోసులను తీసుకున్నట్లు తెలిపారు. కరోనా ఉన్న సమయంలో కూడా తమ బస్సుల్లో ప్రయాణించడం ద్వారా కరోనా సోకిందంటూ నమోదైన కేసులు కూడా లేవని చెబుతున్నారు.అంతే కాకుండా డిపోల నుంచి బయటకు వచ్చే ప్రతి బస్సును పూర్తి స్థాయిలో శానిటైజ్ చేసిన అంనతరమే బయటకు పంపినట్లు తెలిపారు. సిబ్బందికి ధర్మోస్క్రీనింగ్ చేసిన అనంతరమే విధుల్లో తీసుకునేవారమని చెప్పారు.

సంస్థలో పనిచేసే సిబ్బందికి కరోనా వైరస్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలను ప్రత్యేక శిక్షణా కేంద్రాలద్వారా వివరించామని తెలిపారు. ప్రతి బస్సులోనూ ఇటు సిబ్బంది కోసమే కాకుండా అటు ప్రయాణికులకు శానిటైజ్ ఏర్పాట్లు చేశామన్నారు. ప్రత్యేక కళాజాతాలను ఏర్పాటు చేసి కరోనా వైరస్ పట్ల ఉన్న అనుమానాలు, అపోహలు నివృత్తి చేశామన్నారు. దాంతో క్రమంగా సంస్థ తీసుకుంటున్న ప్రత్యేక చర్యలు,ద్వారా ప్రయాణికులు సంతృప్తని వ్యక్తం చేసి ఆర్‌టిసిబస్సుల్లో ప్రయాణించేందుకు మొగ్గుచూపినట్లు తెలిపారు. కరోనా సమయంలో గ్రేటర్‌లో ఆక్యుపెన్నీ రేషియో 25 నుంచి 30 శాతం మాత్రమే ఉందని, కాని ప్రస్తుతం గ్రేటర్ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గడంతో ప్రస్తుతం సుమారు 55 నుంచి 65 శాతంగా ఉన్నట్లు తెలిపారు. త్వరలో గతంలో మాదిరిగా 70 శాతానికి పైగా ఆక్యుపెన్సీ రేషియో( బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య) మరింత పెరుగుతుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News