Home తాజా వార్తలు 50 రోజుల్లో 100 సభలు : హరీశ్‌రావు

50 రోజుల్లో 100 సభలు : హరీశ్‌రావు

100 TRS Meetings in 50 days : Harish Rao

సిద్దిపేట : హుస్నాబాద్‌లో ఈనెల 7న నిర్వహించే సభకు ప్రజల ఆశీర్వాద సభ అని నామకరణం చేసినట్టు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్ మంగళవారం సమీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపి వినోద్, ఎంఎల్‌ఎ సతీశ్ తదితరులు పాల్గొన్నారు. యాబై రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వంఆద బహిరంగసభలు నిర్వహిస్తామని హరీశ్‌రావు వెల్లడించారు. ఈ సభల్లో నాలుగేళ్లలో తమ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేస్తామని ఆయన పేర్కొన్నారు. పండితుల సూచన మేరకు శ్రావణ మాసంలో బహిరంగ సభ ప్రారంభించాలని కెసిఆర్ నిర్ణయించారని ఆయన చెప్పారు. ఈ క్రమంలోనే తెలంగాణలో ఈశాన్య ప్రాంతమైన హుస్నాబాద్‌లో తొలిసభను నిర్వహిస్తున్నామన్నారు.

100 TRS Meetings in 50 days : Harish Rao