Home తాజా వార్తలు మెడికల్ కాలేజీలకు రూ.వెయ్యి కోట్లు

మెడికల్ కాలేజీలకు రూ.వెయ్యి కోట్లు

Medical Colleges

మన తెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వంనుంచి రూ. వెయ్యి కోట్లకు పైగా నిధులు అందనున్నాయి. వైద్య విద్యలో కొత్తగా మంజూరైన అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ సీట్లకు అనుగుణంగా ఈ నిధులు మంజూరుకు కేంద్రం అంగీకారం తెలిపినట్టు విశ్వసనీయంగా తెలిసింది. పెరిగిన యూజి, పిజి సీట్ల సంఖ్య ఆధారంగా ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర వైద్య విద్య సంచాలకుడిని ఇప్పటికే కోరింది. ఈ నిధులను ఆయా వైద్య కళాశాలల ఇన్‌ఫ్రాస్ట్రక్టర్ డెవలెప్ మెంట్ కోసం వినియోగించాల్సి ఉంటుంది. అయితే ఈ నిధులకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 40 శాతం మొత్తాన్ని మంజూరు చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో గడిచిన రెండు మూడేళ్లలో కొత్తగా వచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని ఎంబిబిఎస్ సీట్లకు, పిజి మెడికల్ సీట్లకు కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సాయం చేయనుంది. ఒక్కో ఎంబిబిఎస్ సీటుకు రూ. 1.20 కోట్లు, పిజి సీటుకు రూ. 1.35 కోట్లు చొప్పున నిధులు మంజూరు చేయనుంది.

తెలంగాణలో కొత్తగా మహబూబ్ నగర్, సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేటలలో వైద్య విద్య కళాశాలలు మంజూరు అయ్యా యి. వీటిలో పాలమూరు, సిద్దిపేటలో ఇప్పటికే కాలేజీలు ప్రారంభం కాగా నల్గొండ, సూర్యాపేటలలో మాత్రం ఈ ఏడాది నుంచే ప్రవేశాలు ప్రారంభం అయ్యాయి. కొత్తగా ప్రారంభమైన ఆ నాలుగు కాలేజీల్లో ఒక్కోదాంట్లో 150 చొప్పున మొత్తం 600 ఎంబిబిఎస్ సీ ట్లు వచ్చాయి. అలాగే అగ్రవర్ణాల్లోని ఆర్థిక బలహీన వ ర్గాల (ఇడబ్యుఎస్) కోటా కింద అదనంగా మరో 180 సీ ట్లు వచ్చాయి. దీంతో ఒక్క యూజిలోనే కొత్తగా 790 సీ ట్లు మంజూరయ్యాయి. వీటితో పాటు పోస్టు గ్రాడ్యుయేట్ కు సంబంధించి 150 సీట్లు వరకు కొత్తగా వచ్చాయి. రెండు కలపి మొత్తం 940 సీట్లు అయ్యాయి. మొత్తం రూ. 1128 కోట్లు వైద్యవిద్యకు రావాల్సివుంటుంది.

1000 Crore For Development of Govt Medical Colleges