Thursday, March 28, 2024

కరోనాతో వెయ్యి మంది విద్యుత్ ఉద్యోగుల మృతి

- Advertisement -
- Advertisement -

1000 Electrical workers killed with corona

ఎఐపిఇఎఫ్ వెల్లడి

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా విద్యుత్ రంగానికి చెందిన దాదాపు వెయ్యిమందికి పైగా ఉద్యోగులు కరోనా సెకండ్ వేవ్‌తో ప్రాణాలు కోల్పోయినట్టు ఆల్ ఇండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ (ఎఐపిఇఎఫ్ ) వెల్లడించింది. ఈ వైరస్ బారిన 15 వేల మంది పడ్డారని తెలియచేసింది. ఒక్క మహారాష్ట్ర లోనే 7100 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, 210 మంది మృతి చెందారు. యుపిలో 4 వేల మందికి వైరస్ సోకగా, 140 మంది చనిపోయారు. వెయ్యి మంది మృతుల్లో ముగ్గురు చీఫ్ ఇంజినీర్లు (ఇద్దరు యుపి, ఒకరు హర్యానా), రెండు డజన్లు మందికి పైగా సూపరింటెండింగ్ ఇంజినీర్లు ఉన్నారని వీరిలో తొమ్మిది మంది యుపికి చెందిన వారేనని ఎఐపిఇఎఫ్ అధికార ప్రతినిధి వీకె గుప్తా వెల్లడించారు.

హర్యానాలో 900 మంది వైరస్ బారిన పడగా, 20 మంది ప్రాణాలు కోల్పోయారని, పంజాబ్‌లో వైరస్ సోకిన 700 మందిలో 20 మంది మరణించారని చెప్పారు. అన్ని రాష్ట్రాల్లోని విద్యుత్ ఉద్యోగులకు టీకా వెంటనే అందించాలని, ఫ్రంట్‌లైన్ వర్కర్లుగా పరిగణించాలని, ప్రధాని నరేంద్రమోడీని, కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కేసింగ్‌ను కోరుతూ ఎఐపిఇఎఫ్ లేఖ రాసింది. ఈమేరకు రాష్ట్రాలను ఆదేశించాలని కోరింది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు ఇప్పటికే ఎన్‌టిపిసి, పవర్‌గ్రిడ్స్ సంస్థల ఉద్యోగులకు ప్రత్యేకంగా టీకాలు వేస్తున్నారని తెలియచేసింది. కరోనాతో మృతి చెందినవారి కుటుంబాలకు రూ.50 లక్షల వంతున నష్టపరిహారం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాలని కోరింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News