Tuesday, January 31, 2023

మోడీ వెయ్యిరోజులు!

- Advertisement -

modi

ఫిబ్రవరి 19, ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధికారం చేబట్టి 1000రోజులు పూర్తవుతుంది. గడచినకాలం సమీక్షకేగాక ముందుకు చూడటానికి కూడా ఇది సమయం. బిజెపి మనల్ని నమ్మించజూస్తున్నట్లుగా ఆయన విశిష్టతతో ఉత్తీర్ణుడైనా డా లేక కాంగ్రెస్ నాయ కత్వంలోని ప్రతిపక్షం ఆరోపిస్తున్నట్లు అతను ఫెయి లయినాడా?వాస్తవం ఏమంటే అతడు ఎంతోకొంత సాధించాడు, 2019లో రెండవసారి అధికారం కోరా లంటే చేయవలసింది ఎంతో వుంది. బిజెపి తను సీట్ల సంఖ్యను పెంచుకుని 8రాష్ట్రాల్లో అధికారంలో ఉంది,మరో 5రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాల్లో భాగస్వామిగా ఉంది. గత మూడేళ్లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో – బీహార్, ఢిల్లీ మినహా – పార్టీ మంచి ఫలితాలు సాధించింది. సభ్యత్వంలో కాంగ్రెస్ పార్టీని అధిగమించి బిజెపి అతిపెద్ద పార్టీగా తయా రైంది. ఈ సంవత్సరపు ఐదు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మార్చి11న తెలుస్తాయి.

వచ్చే 2 సంవత్సరాలు మోడీకి చాలా కీలకం. బిజెపి వ్యూహకర్తలు 2019 లోక్‌సభ ఎన్నికల కొరకు పథకాలు రచించటం అప్పుడే ఆరంభించారు. మోడీకి రెండవ పదవీకాలంపై దృష్టితోనే ప్రతి ఒక్క చర్య తీసుకోబడుతున్నది. అది పాకి స్థాన్‌పై సర్జికల్ స్ట్రయిక్ కావచ్చు, పెద్దనోట్ల రద్దు కావచ్చు, ప్రస్తుత అసెంబ్లీ ఎన్ని కలకు సన్నాహాలు కావచ్చు, అలాగే వచ్చే సంవత్సరం 8 అసెంబ్లీలకు ఎన్నికలు కావచ్చు. ప్రధానమంత్రి పదవికి పోటీకొరకు మోడీ 2012 నుంచే సన్నద్ధం కాలేదా?

విదేశాంగ విధాన చొరవల్లో మోడీ సాఫల్యం మరింత స్పష్టంగా కనిపి స్తున్న ది. విదేశాల్లో, భారతీయ సంతతివారిలో దేశ ప్రతిష్టను పెంచారు. అమెరి కాతో సంబం ధాలను గణనీయంగా పెంచారు. భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆప్ఘనిస్థాన్ లతో కూడా సంబంధాలు మెరుగైనాయి. ఆయన పాకిస్థాన్ విధానం పిల్లి మొగ్గలుగా సాగు తున్నది. గత సంవత్సరం నిర్వహించిన ఆఫ్రికన్ మహాసభ 54 ఆఫ్రికా దేశాలతో మాటా-మంతీ మెరుగుపరిచాయి. లాటిన్ అమెరికా, జపాన్‌తో కూడా సంబంధాలు మెరుగైనాయి. భారత్-అమెరికా సంబంధాల స్థాయి పెరగటం పట్ల సాంప్రదాయక మిత్రదేశం రష్యాలో కొంత ఆందోళన ఉంది. అయితే ఐదేళ్ల పదవీకాలంలో మిగిలిఉన్న కాలం చాలా ముఖ్యం. వచ్చే రెండు సంవత్సరాలు అనేక ఎన్నికలున్నాయి.

ప్రస్తుత ఎన్నికలనుంచి లోక్‌సభ ఎన్నికలలోపు గుజరాత్, నాగాలాండ్, కర్నాటక, మేఘాలయ, హిమా చల్ ప్రదేశ్, త్రిపుర, మిజోరం, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘర్, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, ఒడిశా అసెంబ్లీ ఎన్నికలున్నాయి. రెండు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవు ల్లోకి తాను ఎంచు కున్న వ్యక్తులను మోడీ పంపగలడో లేడో మార్చి11న తేలు తుంది. 2017 జులైలో ఆ ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల ప్రచారధోరణితో, పార్లమెంటులో ప్రతిపక్షంతో సంఘర్షణ వైఖరి అనుసరిస్తున్న మోడీ ఎంతో ఇచ్చి పుచ్చుకునే వైఖరి అనుసరించాల్సి వస్తుంది. గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘర్ రాష్ట్రాల్లో బిజెపి-కాంగ్రెస్ మధ్య ముఖాముఖీ పోటీ ఉంటుంది కాబట్టి కాంగ్రెస్‌తో ఘర్షణ తీవ్రతరమవుతుంది. దేశంలో పనితీరుకు సంబంధించి, పెద్దనోట్ల రద్దువల్ల జిడిపి వృద్ధిరేటు అంచనా 7.6శాతం నుంచి 7శాతానికి తగ్గినా, ఆర్థిక వ్యవస్థ పని తీరు మొత్తం మీద సంతృప్తిగా నే ఉంది.

ద్రవ్యోల్బణం కొద్ది సంవత్సరాల క్రితంతో పోల్చితే సగా నికి తగ్గింది. బడ్జెట్‌లోటు తగ్గింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి, విదేశీ మారక ద్రవ్యనిల్వలు పెరిగాయి. అయితే మౌలిక వసతుల కల్పనపై, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై వెచ్చించే ధనాన్ని ఎంతో పెంచాల్సి ఉంది. ఉపాధి కల్పనలో ప్రభుత్వం విఫలమైంది. కొన్ని సంస్కరణలకు పార్లమెంటు ఆమోదం పొందలేక పోతున్నది. పెద్దనోట్ల రద్దు వల్ల మంచి జరిగిందా, చేటు జరిగిందా అనే దానిపై ప్రజల తీర్పు త్వరలోనే వెల్లడికానుంది. ఈ జూదం బిజెపి కి మేలు చేస్తుందా, కీడు చేస్తుందా అని బిజెపి నాయకులు సైతం వేచిచూస్తున్నారు. పెద్దనోట్లు రద్దు చేసిన మోడీ చర్య ఆర్థికం కన్నా రాజకీయమైంది. సాంప్రదాయక బ్రాహ్మణ, వైశ్య, ఒబిసి ఓట్లకు పేదల ఓట్లను జతచేసే ప్రయత్నంగా ఆ పనిచేశారు. నల్లధనం సమస్యకు సంబంధించి మోడీ స్థిరాస్తిరంగం బినామీలపై గురిపెడతారా? ఎన్నికల సంస్కర ణలు తెస్తారా? ఇది రెండంచుల కత్తి వంటిది.

వ్యవసాయరంగంలోకి పెద్దఎత్తున డబ్బు పంపాల్సి ఉంది. ఈ సంవత్సరం మంచి గా వర్షాలు కురవటం ప్రభుత్వానికి శుభవార్త .అయితే ప్రకృతి ఒడిదుడు కుల కారణం గా వచ్చేరెండేళ్లు ఇలాగే ఉంటుందని చెప్పలేము. పెరుగుతున్న రైతు ఆత్మహత్యల సమస్యపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. రైతులు దేశానికి వెన్నెముక అయి నందున వారి సమస్యల పరిష్కారానికి అత్యవసర ప్రాధాన్యత ఉంది. మూడు, ఆయిలు ధర తగ్గిపోవటం దేశానికి ఎంతో లాభించింది. వచ్చే రెండేళ్లు ఇలాగే ఉంటుందని ఎవరూ చెప్పలేరు. ఆయిల్‌ధర పెరుగుదల మొదలైంది. అది మరింతగా పెరిగితే ఆర్థిక వ్యవస్థ కు ఇబ్బందులు తప్పవు. రవాణా చార్జీలు పెరుగుతాయి కాబట్టి సామాన్య మానవులకు కూడా దెబ్బతగులుతుంది. నాలుగు, మోడీ ప్రారంభించిన అనేక పథకాల ఫలితాలు లబ్దిదారులకు చేరేటట్లు వాటిని సమర్థవంతంగా అమలు జరపాలి. సూక్ష్మంగా చెప్పాలంటే ఆర్థికం, విదేశాంగ విధానం, రాజకీయ రంగాల్లో మోడీ ప్రవేశపెట్టిన చలనశీలతను కొనసాగించగలగాలి. (ఐపిఎ)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles