Tuesday, April 16, 2024

తమిళనాడులో వెయ్యేళ్ల నాటి ప్రాచీన విగ్రహాలు స్వాధీనం

- Advertisement -
- Advertisement -

1000 year old antique idols seized in Thanjavur

చెన్నై: వెయ్యేళ్ల పూర్వం నాటి ఐదు అత్యంత ప్రాచీన విగ్రహాలతోసహా 8 విగ్రహాలను తమిళనాడులోని తంజావూరు జిల్లాకు చెందిన స్వామిమలైలోని ఒక రహస్య స్థావరంలో తమిళనాడు విగ్రహాల విభాగానికి చెందిన సిఐడి అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. 200 కిలోల బరువైన భోగశక్తి అమ్మవారి విగ్రహం, రెండు బుద్ధుని విగ్రహాలు, ఆండాళ్, విష్ణుమూర్తి విగ్రహాలు&వెయ్యేళ్ల పూర్వం నాటివిగా భావిస్తున్న ఐదు విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. ఇవేగాక వందేళ్ల క్రితం నాటిదిగా భావిస్తున్న నటరాజ విగ్రహంతోపాటు శివగామి అమ్మవారు, రమణ మహర్షి విగ్రహాలు కూడా ఈ దాడిలో లభించాయి. స్వాధీనం చేసుకున్న అ అపురూపమైన విగ్రహాల విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో అఏక కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. శివకంచిలో జరిగిన విగ్రహాల చోరీ కేసులో నిందితునిగా ఉన్న జి మాశిలామణి నివసించే కోడంబాకంలోని ఆయన ఇంట్లో అధికారులు సోదా జరపగా ఎటువంటి ఫలితం దక్కలేదు. అయితే ఈనెల 9న సెర్చ్ వారెంట్‌తో స్వామిమలై వెళ్లి మాశఙలామణికి చెందిన రహస్య స్థావరంపై అధికారులు దాడులు జరపగా ఈ విగ్రహాలు లభించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News