Thursday, March 28, 2024

అనుమతుల్లేని ఆస్పత్రులపై కొరడా

- Advertisement -
- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా 103 ప్రయివేట్ ఆస్పత్రులు సీజ్

75 దవాఖానాలకు జరిమానా విధింపు 2,058 ఆసుపత్రుల్లో తనిఖీలు, 633 హాస్పిటళ్లకు నోటీసులు అన్ని
ఆసుపత్రులు, రిజిస్ట్రేషన్ తప్పనిసరి అనర్హుల వైద్యంతో రోగుల ప్రాణాలకు ముప్పు ఎంబిబిఎస్
డాక్టర్ బోర్డుతో ఆయుష్ వైద్యుల వైద్యం అలోపతిక్ చికిత్సతో పాటు సర్జరీ చేస్తున్న ఆర్‌ఎంపిలు తనిఖీల్లో
ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డా. శ్రీనివాసరావు

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రులపై ఉక్కుపాదం మోపుతోంది. జిల్లాల్లో ఎక్కడికక్కడ అనేక ఆసుపత్రులను సీజ్ చేస్తోంది. కొన్నింటికి షోకాజ్ నోటీసులు జారీచేసింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఆసుపత్రులపై కొరడా ఝుళిపిస్తోంది. తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్మెమెంట్ యాక్ట్ (రిజిస్ట్రేషన్ – రెగ్యులేషన్) యాక్ట్ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రులపై పెద్దఎత్తున తనిఖీలు జరుగుతున్నా యి. ఇప్పటివరకు జరిగిన తనిఖీల్లో కొన్ని ఆసుపత్రుల్లో కనీస మౌలిక సదుపాయాలు లేనట్లుగా అధికారులు గుర్తించారు. కొన్నిచోట్ల అర్హులైన డా క్టర్లు వైద్యం చేస్తున్నట్లుగా తనిఖీల్లో తేలింది.

రా ష్ట్రంలోని 33 జిల్లాల్లో 2,058 ప్రైవేట్ ఆసుపత్రు ల్లో ఆయా జిల్లాల డిఎంహెచ్‌ఒలు తనిఖీలు నిర్వహించినట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. అందులో 103 ఆసుపత్రులను సీజ్ చేసి, 633 ఆసుపత్రులకు నోటీసులు జారీ చేశామన్నారు. అలాగే 75 ఆస్పత్రులకు జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. డిహెచ్ శ్రీనివాసరావు బుధవారం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ హాస్పిటళ్లు, క్లినిక్‌లు, క న్సల్టేషన్ రూమ్‌లు, డయాగ్నస్టిక్ కేంద్రాలు, నాన్ అలోపతిక్ ఆస్పత్రులను క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ 2020 కిందకు తీసుకువచ్చినట్లు తెలిపా రు. ఈ చట్టం ప్రకారం ప్రతి ఆసుపత్రి, క్లినిక్, నాన్ ఆయుష్ క్లినిక్‌లు అన్ని రిజిష్టర్ చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో డిహెచ్‌ఎంఒల ఆధ్వర్యం లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు ప్రారంభం కాని జిల్లాల్లో కూడా తనిఖీలు ప్రారంభమవుతాయని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్‌లలో ఎక్కడైనా లోపాలు, చికిత్సలో నిర్లక్షం కనిపించినట్లు ప్రజలు గుర్తిస్తే తమ దృష్టి తీసుకువస్తే ఆ హాస్పిటళ్లపై చర్యలు తీసుకుంటామని అన్నారు.

నాన్ అలోపతిక్ ఆసుపత్రుల్లో అలోపతిక్ చికిత్స

నాన్ అలోపతిక్ ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ కేంద్రాలు, ఇతర వైద్యానికి సంబంధించిన క్లినిక్‌లు అన్నీ క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని డీహెచ్ స్పష్టం చేశారు. నాన్ అలోపతిక్ ఆసుపత్రులు, క్లినిక్‌లలో చికిత్స చేయడం, అలోపతిక్ మందులు ఇవ్వడం, చిన్న చిన్న సర్జరీలు చేసి రోగుల ప్రాణాలమీదకు తీసుకువస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. సిఎం కెసిఆర్, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు ఈ ఆసుపత్రులలో తనిఖీలు నిర్వహించి, ఆయా ఆసుపత్రులకు రిజిస్ట్రేషన్ ఉందా..? లేదా..?అర్హులైన వైద్యులు ఉన్నారా..? లేరా…? అని పరిశీలిస్తున్నామని అన్నారు.

లోపాలు గుర్తించిన ఆసుపత్రులకు రెండు వారాల గడువు

లోపాలు గుర్తించిన రిజిష్టర్డ్ ఆసుపత్రులకు కూడా నోటీసులు జారీ చేశామని డీహెచ్ తెలిపారు. వారికి రెండు వారాల గడువు ఇచ్చి లోపాలను సరిచేసుకోవాలని చెబుతున్నామని అన్నారు. గడువులోగా లోపాలను సరిచేసుకోకపోతే ఆ ఆసుపత్రులపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాలలో ఆర్‌ఎంపిలు, పిఎంపిల రూపంలో వారికి అర్హత లేకున్నా చికిత్స, సర్జరీలు చేస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా చట్టవ్యతిరేకంగా అబార్షన్లు చేసి కొంతమంది ప్రాణాలు పోయేందుకు కారణమవుతున్నారని, వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌ఒలకు ఆదేశించామని అన్నారు. తమ తనిఖీలలో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు. కొన్ని క్లినిక్‌ల వద్ద ఎంబిబిఎస్ వైద్యుల బోర్డులు పెట్టుకుని ఆయుష్ డాక్టర్ లేదా అర్హత లేని వైద్యులు చికిత్స ఇస్తున్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. అలాగే ప్రాథమిక చికిత్స పేరుతో కొంతమంది ఆర్‌ఎంపీలు ఆలోపతి చికిత్స చేయడం, సర్జరీలు చేయడం వంటివి తమ దృష్టికి వచ్చాయని తెలిపారు.

ఒత్తిళ్లకు తలొగ్గొద్దు

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రైవేట్ ఆసుపత్రుల్లో తనిఖీలలో భాగంగా డీఎంహెచ్‌ఓలు ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గొద్దని డీహెచ్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ఇతరులు ఎవరూ ఒత్తిడి చేసినా తలొగ్గొద్దని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ఆస్పత్రులపై చట్టప్రకారం తీసుకోవాలని తెలిపారు. ఈ తనిఖీలు రాబోయే రోజుల్లో కూడా కొనసాగుతాయని స్పష్టం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News