Home జాతీయ వార్తలు భారత్ లో తగ్గిన కరోనా కేసులు

భారత్ లో తగ్గిన కరోనా కేసులు

10584 Corona Cases Registered In Indiaన్యూఢిల్లీ : భారత్ లో గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన కేసులు మంగళవారం తగ్గాయి. గడిచిన ఒక్కరోజులో కొత్తగా 10,584 మంది కరోనా బారిన పడ్డారని‌ కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ అధికారులు మంగళవారం ఉదయం మీడియాకు తెలిపారు. గడిచిన ఒక్కరోజులో  13,255 మంది కరోనా నుంచి కోలుకున్నారని, కొత్తగా 78 మంది చనిపోయారని వారు చెప్పారు. ఇప్పటివరకు భారత్ లో  మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,10,16,434కు చేరిందని, ఇప్పటివరకు 1,07,12,665 మంది కరోనా నుంచి కోలుకున్నారని, ఇప్పటి వరకు కరోనా కారణంగా 1,56,463 మంది చనిపోయారని వారు వెల్లడించారు. భారత్ లో  ప్రస్తుతం 1,47,306 యాక్టివ్‌ కేసులున్నాయని,  1,17,45,55 మందికి కరోనా టీకాలు వేసినట్టు వారు పేర్కొన్నారు. సోమవారం ఒక్కరోజే  6,78,685 కరోనా‌ శాంపిల్స్‌ పరిశీలించామని, ఇప్పటి వరకు 21,22,30,431 శాంపిల్స్‌ పరీక్షించినట్లు అధికారులు స్పష్టం చేశారు.