Home తాజా వార్తలు రికార్డు స్థాయిలో కరోనా కేసులు

రికార్డు స్థాయిలో కరోనా కేసులు

Corona

 కొత్తగా 107 మందికి వైరస్ నిర్ధారణ
39 మంది స్థానికులు, వలస కూలీలు 19మందికి వైరస్
కరోనాతో ఆరుగురి మృతి
2098కి చేరినా కరోనా బాధితులు
63కి పెరిగిన మరణాల సంఖ్య

హైదరాబాద్ : రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఎన్నడూ లేని విధంగా తొలిసారి ఏకంగా 107 పాజిటివ్‌లు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి బుధవారం ఫైవ్ పిఎం వరకు రాష్ట్రంలో 39 లోకల్ కేసులు నమోదు కాగా, కొత్తగా 19 మంది వలస కార్మికులకు, విదేశాల నుంచి వచ్చిన 49 మందికి వైరస్ సోకినట్లు వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నారు. అదే విధంగా వైరస్ దాడిలో బుధవారం మరో ఆరుగురు చనిపోగా, రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 63కి పెరిగింది.

దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2098కి చేరగా, ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1321కి పెరిగింది. ప్రస్తుతం ప్రభుత్వ నోటిఫైడ్ ఆసుపత్రుల్లో 714 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1842 మంది స్థానికులకు వైరస్ సోకగా, వివిధ రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన 173 మంది వలస కార్మికులకు, 124 మంది విదేశీయులూ కోవిడ్ బారీన పడ్డారని అధికారులు ధ్రువీకరించారు.

మరణాలను ధ్రువీకరించని అధికారులు

రాష్ట్రంలో కరోనా మరణాలను అధికారులు బులిటెన్‌లో పేర్కొనడం లేదు. నగరానికి చెందిన ఏడు రోజుల పసికందు చనిపోయినట్లు వార్తలు వచ్చినా, అధికారులు దానిపై స్పష్టతనివ్వలేదు. అంతేగాక కొత్తగా ఆరుగురు మరణించినట్లు బులిటెన్‌లో తెలిపారు.

వారు ఎవరనేది దానిలో వివరాలు ప్రకటించలేదు. అంతేగాక కేసులు వివరాల్లో కూడా స్పష్టత లేకుండా బులిటెన్‌ని కన్‌ఫ్యూజ్ చేస్తూ విడుదల చేశారు. ఏదేమైనా బారీగా కేసులు పెరగడంపై ప్రజల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్‌లో కరోనా టెర్రర్ సృష్టిస్తుందన్న సంగతి అధికారులతో పాటు ప్రజలకు సైతం తెలియని విషయం కాదు. కానీ అధికారులు ఈ వివరాలపై స్పష్టత ఇవ్వడం లేదు.

107 new Corona cases in Telangana