Home రాష్ట్ర వార్తలు పెరగనున్న 108 జీతాలు

పెరగనున్న 108 జీతాలు

త్వరలో మరిన్ని వాహనాలు, 104 సేవలూ పటిష్టం : సమీక్షా సమావేశంలో సిఎం ఆదేశాలు – హైదరాబాద్ పరిసరాల్లో నాలుగు పెద్దాసుపత్రులకు స్థలాలు గుర్తించాలని సూచన 

kcrహైదరాబాద్ : ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నవారికి అత్యవసర వైద్య సేవలు అందించే 108 అంబూలెన్స్‌లతో పాటు గ్రామీణ ప్రాంతా ల్లో వైద్య సేవలందిస్తున్న 104 సర్వీ సులను రాష్ట్రంలో మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలు జరిగి నప్పుడు గాయపడిన వారికి తక్షణ వైద్య సేవలు అందే విధంగా పోలీసు, వైద్యశాఖలు సమన్వ యంతో పనిచేయాలని ఆయన కోరారు. జాతీయ రహదారులు, ప్రధాన రహదారుల వెంట వైద్య సేవలు, 108,104 సేవల నిర్వ హణ, గ్రామీణ వైద్య సేవలు మెరుగుపర్చడానికి తీసు కోవా ల్సిన జాగ్రత్తలు తదితర అంశాల పై సిఎం కెసిఆర్ మంగళవారం క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లకా్ష్మరెడ్డి, డిజిపి అనురాగ్ శర్మ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. 108 అంబులెన్స్ సేవలను మెరుగుపర్చాలని సిఎం చెప్పారు. మూడు రోజుల క్రితం తాను టీ న్యూస్ ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొన్నప్పుడు వరంగల్‌కు చెందిన 108 ఉద్యోగి రమేష్ ప్రస్తా వించిన అంశాలపై చర్చించారు. 108 ఉద్యోగుల వేతనాలు పెంచాల్సిన అవసరం ఉందని, ఉద్యోగులు, అధికారులతో మాట్లాడి వేతనాల పెంపుదలపై సానుకూల నిర్ణయం తీసుకో వాలని మంత్రి లకా్ష్మరెడ్డిని ఆదేశించారు. రాష్ట్రం వచ్చిన తరు వాత 108 సేవల మెరుగుదల, విస్తరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు సిఎం గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడే వరకు లక్ష జనా భాకు ఒక 108 అంబూలెన్స్ చొప్పున 312 వాహనాలు మాత్రమే ఉండేవన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి 75వేల జనా భాకు ఒకటి చొప్పున ఉండాలని నిర్ణయం తీసుకున్నామ న్నారు. ఈ నిర్ణయం ఫలితంగా అదనంగా 169 వాహనాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. వీటిలో ఇప్పటికే 145 వాహనాలు అందుబాటులోకి వచ్చి సేవలంది స్తున్నాయని, ఉత్త మమైన సేవలు అందించేందుకు వీలుగా ప్రభుత్వ పరంగా కావాల్సిన సహకారం ఇస్తామన్నారు. నిర్ణీత తేదీల్లో గ్రామాలకు వెళ్ళి వైద్య సేవలందించాల్సిన 104 వ్యవస్థ మరింత మెరుగా పనిచేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధాన రహదారుల వెంట ప్రమాదాలు జరగడం వల్ల అపార ప్రాణనష్టం జరుగుతోందని, దీన్ని నివారించడానిక పోలీసు, వైద్య శాఖలు సంయుక్తంగా కార్యాచరణ రూపొందించు కోవా లని సిఎం ఆదేశించారు. ప్రధాన రహదారుల పొడవునా ట్రా మా సెంటర్లు ఏర్పాటు చేయాలని, వైద్య పరికరాలు అందు బాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ట్రామా సెంటర్ల ద్వారాఆన్‌లైన్ హెల్త్ కేర్ సేవలను ఉపయోగించుకునే ఏర్పాట్లు చేయాలన్నారు. జాతీయ రహదారుల వెంట పెట్రోలింగ్ నిర్వ హించే పోలీసు వాహనాల్లో ప్రథమ చికిత్స కిట్ ఉండాలని ఆయన అన్నారు.